మంత్రులు, ఎంఎల్ఏలపై జగన్ సీరియస్

మంత్రులు, ఎంఎల్ఏలపై జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసిపి తరపున హాజరు తక్కువగా ఉండటంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.  అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మంత్రులు, ఎంఎల్ఏలు తప్పనిసరిగా హాజరు కావాలని జగన్ చెప్పినా చాలామంది వినటం లేదట.

మంత్రులు, ఎంఎల్ఏల హాజరు విషయంలో సీరియస్ గా ఉన్న జగన్ అందరికీ అటెండెన్స్ తీసుకోవాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిని ఆదేశించారట. టిడిపి తరపున ఎంఎల్ఏలు అందరూ హాజరవుతున్నపుడు అధికారపార్టీ తరపున ఎందుకు హాజరు కావటం లేదని జగన్ అందరిపైనా మండిపోతున్నారు.

మంత్రులు, ఎంఎల్ఏల హాజరును తప్పనిసరి చేయటానికి అటెండెన్స్ విధానాన్ని పెడుతున్నారని తెలియగానే అందరిలో వణుకు మొదలైంది. ఏ అంశంపైనైనా టిడిపి ఎంఎల్ఏలు చర్చల విషయంలో పట్టుదలగా ఉన్నపుడు అంతకన్నా ఎక్కువ స్ధాయిలోనే వైసిపి ఎంఎల్ఏలు ఉండాలన్నది జగన్ అభిప్రాయం.

అందుకనే అందరూ తప్పనిసరిగా హాజరయ్యేట్లు చూడాల్సిన బాధ్యతను జగన్ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డిపైన మోపారు. దాంతో అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకుని చీఫ్ విప్ కూడా రెడీ అయిపోయారు. మరి గురువారం నుండి మంత్రులు, ఎంఎల్ఏల హాజరు ఎలాగుంటుందో చూడాలి.