అమరావతి:గత రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో లీకైన మాజీ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియోటేపులు సంచలనం రేపుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సస్పెండ్ అయిన రామకృష్ణ అనే జడ్జ్ తో జరిపిన సంభాషణ రాష్ట్రంలో కొత్త రాజకీయ వివాదానికి తెరలేపిందనే చెప్పాలి. ఈ ఆడియో టేప్ లలో ఉన్న గొంతు ఈశ్వరయ్యదేనని బెంగుళూరుకు చెందిన ట్రూత్ ల్యాబ్ నిర్దారించింది. ఈశ్వరయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జడ్జ్ గా విధులు నిర్వహించారు. ప్రస్థుతానికి ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ టేప్స్ లలో ఈశ్వరయ్య రామకృష్ణతో మాట్లాడుతూ…రాష్ట్ర హై కోర్టులో విధులు నిర్వహిస్తూ మరణించిన రిజిస్టార్ మరణానికి ప్రస్థుత హై కోర్ట్ జడ్జ్ కోవిడ్ నియమాలు పాటించకపోవడమే కారణమని చెప్తూ సుప్రీం కోర్టు కొలిజియంకు లేఖ రాశారని, వీళ్ళతో పాటు సుప్రీం కోర్ట్ జడ్జ్ ల అంతు కూడా చూస్తానని చెప్తున్నారు. జగన్ తో మాట్లాడి నీకు హెల్ప్ చేస్తానని, జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా ఉంటాడని చెప్పాడు.
హై కోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తుండటంతోనే ప్రస్థుత్త హై కోర్టు జడ్జ్ పై అక్రమ ప్రజా వ్యాజ్యాలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఆడియో టేప్స్ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్ళిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న జగన్ ఈశ్వరయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. అయితే ఆ టేప్స్ తనవి కావని, వాటిని ఎవరో ట్యామ్ పరింగ్ చేశారని, రామకృష్ణతో మాట్లాడిన విషయం నిజమే కానీ ఇలా మాట్లాడలేదని ఈశ్వరయ్య వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ ఆడియో టేప్స్ బయటకు వచ్చిన తరువాత టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై విరుచుకుపడన్నారు. ఈ అధికారంలో పని చేస్తున్న ఒక వ్యక్తి జడ్జ్ ల పరువుకు భంగం కలిగించేలా పని చేస్తుంటే మీరేమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఈ ప్లాన్స్ వెనకాల వైసీపీ నాయకులు ఉండే ఈశ్వరయ్యతో జడ్జ్ లపై కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమరావతి గోడవతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఈశ్వరయ్య టేప్స్ జగన్ కు మరో తలనొప్పిని తెచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ టేప్స్ విషయంలో ఈశ్వరయ్యపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.