పనికి రాని మాటలు, పోసుకోలు కబుర్లు, ఎన్నికల వేళ ఊకదంపుడు ఉపన్యాశాలు, నాలుక లేని నరంతో విచ్చలవిడి హామీలూ ఇచ్చే నేతలు నేటి సమాజంలో పుష్కలంగా ఉన్నారన్ని అంటుంటారు. ఇదే సమయంలో ఇచ్చిన హామీని కుర్చీ ఎక్కిన అనంతరం మరిచిపోకుండా… ప్రజల పట్ల బాధ్యతం, భయం కలిగి నడుచుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు అని అంటుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సంగతి తెలిసితే… జనానికి ఒక క్లారిటీ రావొచ్చు.
శ్రీకాకుళం జిల్లా ఉద్దానం పేరు చెప్పగానే అక్కడ ప్రజలను సుమారు 40 ఏళ్లుగా పట్టిపీడిస్తున్న కిడ్నీ సమస్య అందరికీ గుర్తొస్తుందనడంలో సందేహం లేదు. ఎంతోకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉద్దానం ప్రజలు తమ సమస్యను పరిష్కరించే నాధుడే లేడని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయి.. సీనియర్ పొలిటీషియన్స్ ఎందరో వస్తుంటారు పోతుంటారు. అయినా వీరి సమస్య పరిష్కారం కాలేదు.
సుమారు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ మూడు సార్లు ముఖ్యమంత్రి, మరో మూడు సార్లు ప్రధాన పర్తిపక్ష నేతగా ఉన్న నాయకులు ఈ సమస్యను పట్టించుకోలేదు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అన్నవారికి ప్రజలు ఓట్లు వేయకపోవడంతో.. ప్రజల తరుపున నిలబడలేకపోయినట్లు పబ్లిగా చెబుతున్నా పరిస్థితి.
ఈ సమయంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఫలితంగా… ఉన్న దాదాపు లక్ష మంది జనాభాలో 35 శాతం మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే ఉన్న ఉద్దాన్నం సమస్యను తీర్చాలని బలంగా ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా… శాస్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రచించారు.. చేతల్లో చూపించారు!
అవును… ఉద్దానం సమస్యను శాస్వతంగా పరిష్కరించాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఉద్దానం కిడ్నీ బాధితులకు భరోసా కల్పిస్తూ ఆ ప్రాంతానికి దాదాపు 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న హిర మండలం రిజర్వాయర్ నుంచి మెలియాపుట్టి శుద్ధి కేంద్రానికి మంచి నీటిని తరలించి తొలి దశ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసింది.
ఇందులో భాగంగా… సుమారు 32 కిలోమీటర్ల పొడవున భూగర్భ పైప్ లైన్ ద్వారా నీటిని తరలించి.. జల శుద్ధి కేంద్రానికి చేర్చారు. మొత్తం ఈ మార్గంలో 132 కిలోమీటర్ల మేర భూగర్భ పైప్ లైన్ లను నిర్మించి.. ఉద్దానం చివరి ప్రాంతమైన ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీటిని అందించడానికి అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.
దీనికి సంబంధించి ఇప్పటికే తొలి దశ ట్రయల్ రన్ సక్సెస్ చేసింది. ఇదే సమయంలో మరో 15 రోజుల్లో జల శుద్ధి కేంద్రం నుంచి ఉద్దానం చివరి ప్రాంతం వరకు నీటి తరలింపుకు సంబంధించి పూర్తి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. దీనికోసం సుమారు 700 కోట్ల రూపాయలతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని సీఎం జగన్ మంజూరు చేశారు.
ఫలితంగా… శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, పలాస లోని దాదాపు ఏడు మండలాల పరిధిలో ఉన్న ఉద్దానంకు ఉన్న సమస్యకు జగన్ శాశ్వత పరిష్కారాన్ని సూచించినట్లయ్యిందని స్థానికులు చెబుతున్నారని తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అంతా కోరుకుంటున్నారు.