వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనపై గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ యంత్రాంగం ఎలా పనిచేసింది? మాట తప్పను..మడమ తప్పను…మేనిఫేస్టోని కురాన్ ,బైబిల్, భగవద్గీతలా భాశించినట్లు చెప్పిన జగన్? ఆ దిశగా ఎంత వరకూ సక్సెస్ అయ్యారు? అందులో తప్పిదాలు ఏమైనా దొర్లాయా? అంటే ప్రజల నోట నో అనే మాట వస్తుంది తప్ప! జగన్ పై ప్రజల నుంచి ఒక్క వ్యతిరేక వ్యాఖ్య కూడా రాదు. అవును ఈ మాటలు నేతలు చెప్పినవి కాదు..సాక్షాత్తు ప్రజలు చెప్పినవి. ఏడాది పాలనపై ఓవైపు ప్రతిపక్ష పార్టీ బుదరజల్లే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు మాత్రం జగన్ మోహన్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నారు అనడానికి ఆయన సంక్షేమ పథకాలే అద్దం పట్టాయి.
ఏడాది కాలంలోనే దాదాపు మేనిఫేస్టో లోచెప్పిన అంశాల్ని పూర్తిచేసారు. అందులో లేని కొత్త పథకాల్ని కూడా తీసుకొచ్చి కరోనా లాంటి కష్టకాలంలోనూ అమలు చేసారు. చెప్పడానికి ఐదా! పదా? చేసిన ప్రతి వాగ్ధానాన్ని ఏడాది కాలంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకెళ్లిపోయారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కేంద్రమే కితాబిచ్చింది…ది బెస్ట్ సీఎం అని సర్వేలే వెల్లడించాయి. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాల్గవ స్థానంలో స్థానం సంపాదించారు. జగన్ పాలన భేష్ అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి.
మరి జగన్ నెంబర్ వన్ అనిపించుకోవడానికి చేయాల్సిన పనేంటి? అంటే పార్టీలో నేతల్ని..మంత్రుల్ని…ఎమ్మెల్యేల్ని మచ్చిక చేసుకుంటే సరి! జగన్ ని పడగొట్టే నాయకుడు ఎవరు? అని నిపుణులే అభిప్రాయపడుతున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా పార్టీలో అసంతృప్తి..అధికారుల ఓవరేక్షన్ కారణంగా జగన్ నిందలు మోయాల్సి వస్తోందన్నది వాస్తవం. మంత్రులకు అపాయింట్ మెంట్లు ఇవ్వలేదని..నియోజక వర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని అసంతృప్తి జ్వాలలు లేచాయి. ఈ నేపథ్యంలో జగన్ కి-మంత్రి వర్గానికి మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చింది. జగన్ మెప్పుకోసం అధికారులు ఓవరేక్షన్ పార్టీ విధానాలపై ప్రభావం చూపింది. జగన్ ఈ రెండు అంశాలపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టి పనిచేస్తే! ఆల్ సెట్.