అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పుకోదగ్గ రాజకీయ నాయకుడు, ఒక పెద్ద బీసీ నాయకుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలకు అసీంబ్లీలో చుక్కలు చూపించారు. అవసరం ఉన్నా లేకున్నా ఇష్టమొచ్చినట్టు వైసీపీ నాయకులను కించపరచేవాడు. ఎర్రన్నాయుడుని జాతీయ రాజకీయాల్లో ఉపయోగించిన చంద్రబాబు, అచ్చెన్నాయుడిని రాష్ట్ర రాజకీయాల్లో ఉపయోగించుకున్నారు. అచ్చెన్నాయుడు చేత అప్పట్లో జగన్ ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ తాను ఓడించాలనుకున్న వారికి టార్గెట్ పెట్టి మరీ ఓడించారు. టీడీపీని కేవలం 23 సీట్స్ కే పరిమితం చేశారు. తాను టార్గెట్ చేసిన అందరిని జగన్ ఓడించారు కానీ అచ్చెన్నాయుడిని మాత్రం ఓడించలేకపోయారు. అయితే రానున్న 2024 ఎన్నికల్లో అచ్చెన్నాయుడిని ఓడించడానికి జగన్ ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు.
2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ ను అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచిన టెక్కలి ఇంచార్జిగా చేసి, ఒక ఆన్ ఆఫీషియల్ ఎమ్మెల్యేగా జగన్ నియమించారు. ఆయనే ఇకపైన నాలుగేళ్ళూ అక్కడి పనులు చక్కబెట్టి ప్రజలను ఆకర్షించాలి. ప్రజల పనులను దువ్వడా చూస్తుండగా అచ్చెన్నాయుడి పనిని జగన్ చూసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అచ్చెన్నాయుడు తన టీడీపీ క్యాడర్ కు దూరంగా ఉన్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా కొన్నాళ్ళు విశాఖలో గడిపిన అచ్చెన్నాయుడును వైసీపీ సర్కార్ ఏసీబీ కేసులు పెట్టి మరీ రెండు నెలలుగా జైలుపాలు చేసి ఉంచింది. ఈ గ్యాప్ లో దువ్వడా టీడీపీలో ఉన్న ప్రముఖ నాయకులకు గలేం వేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో తనను అచ్చెన్నాయుడిపై జగన్ భారీ ఆపరేషన్ ప్లాన్ చేశాడని, ఆ ఆపరేషన్ ను పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.