ప్రజల ఆరోగ్యం విషయంలో జగన్ కీలక నిర్ణయం… పీక్స్ అంటున్న ఫ్యాన్స్!

నాయకుడు అనేవాడు, పాలకుడు అనేవాడూ ప్రజలకు అందించే సంక్షేమం విషయంలోనూ.. వారి ఆరోగ్యం విషయంలోనూ.. వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే విషయంలో ఒక అడుగు ముందుకు ఉండాలని పుస్తకాల్లో చదువుకున్నట్లు గుర్తు! అయితే తాజాగా ఆ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక అడుగు ముందుకు వేశారని అంటున్నారు పరిశీలకులు. అందుకు కారణం.. జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం!

అవును… బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఫలితంగా… వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా.. ప్రత్యేకించి కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని అంచనా వేసింది.

దీనిఫలితంగా… మన్యం పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కడప, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో… విపత్తుల నిర్వహణ విభాగం కూడా భారీ వర్షాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

ఇవి రెగ్యులర్ గా జరిగే కార్యక్రమాలే కదా అనుకుంటే పొరపాటే… ఈ సమయంలో జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా… వర్షాలతో పాటు సీజనల్ వ్యాధులు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టబోతోంది.

అవును… ఏపీలో సోమవారం (జూలై 10) నుంచి ఫీవర్ సర్వే ప్రారంభం కానుంది. వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు. ఇందులో భాగంగా… ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వేను చేపడతారు. ఇదే సమయంలో ఇప్పటికే ప్రభుత్వ వైద్య అధికారులకు జగన్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా డెంగ్యూ, మ‌లేరియా కిట్ల కొర‌త లేకుండా చూడాలని సూచించింది.

దీంతో… సాధారణంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్/నవంబర్ వరకు సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందని, వాటిని నివారించడానికి గ్రామస్థాయిలో సమన్వయంతో పని చేయాలని ప్రజలు నిత్యం కోరుకుంటారని… కాకపోతే ఫస్ట్ టైం ఈ స్థాయిలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం గొప్ప విషయం అని వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.