బ్రేకింగ్ న్యూస్ : జగన్ తో టిఆర్ఎస్ నేతల భేటీ

షెడ్యూల్ ఎన్నికలకు ముందు కీలక సమావేశం జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో టిఆర్ఎస్ నేతలు భేటీ అవుతున్నారు. బిజెపి, కాంగ్రెస్ యేతర పార్టీలతో జాతీయస్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలయి కెసియార్ చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అనుకుంటున్న వైసిపిని ఫెడరల్ ఫ్రంట్ లో చేరాల్సిందిగా జగన్ ను కెసియార్ ఆహ్వానించారు. ఆ విషయమై డీటైల్డ్ గా మాట్లాడటానికే జగన్ ను టిఆర్ఎస్ నేతలను తన నివాసానికి ఆహ్వానించారు. ఈ రోజు మధ్యాహ్నం బహుశా రెండు పార్టీల మధ్య విందు భేటీ జరిగే అవకాశం ఉంది.

ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతీరోజు జగన్ పై పడి ఏడుస్తున్నారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా జగన్ టిఆర్ఎస్ తో ఎలా జత కడతారంటూ తరచూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై కక్షసాధించేందుకే జగన్ టిఆర్ఎస్ తో కలుస్తున్నారంటూ పవన్ కూడా ధ్వజమెత్తుతున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు, పవన్ ఇద్దరూ జగన్నే టార్గెట్ గా పెట్టుకోవటంతో వాళ్ళిద్దరి మధ్య లోపాయికారీగా ఏమైనా అవగాహన కుదిరిందా అన్న అనుమానాలు పెరిగిపోయాయి. రేపు మళ్ళీ చంద్రబాబు, పవన్ పొత్తులు పెట్టుకున్నా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, ఇద్దరి పరిస్ధితి ఒకేలాగుంది. దానికితోడు తమతో పొత్తు పెట్టుకొమంటూ పవన్ ను పదే పదే చంద్రబాబు గోకుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు, పవన్ ను ఒకేసారి దెబ్బ కొట్టాలంటే తనకు ఎవరో ఒకరి నుండి బలమైన మద్దతు అవసరమన్న భావన జగన్ లో కనిపిస్తోంది. ఎలాగూ చంద్రబాబంటే కెసియార్ మండిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఇవ్వటానికి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేసుకుంటున్నట్లు ఇప్పటికే కెసిఆర్ చాలాసార్లే చెప్పారు. కాబట్టి కెసియార్ తో కలిస్తే తనకు లాభముంటుందని జగన్ అనుకుంటున్నట్లున్నారు.

ఎలాగూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ కు మద్దతుగా ముస్లిం ప్రాబల్యమున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తానని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దన్ అక్బర్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ తో చేరటం వల్ల వచ్చే లాభాలపై జగన్ ఈరోజు భేటీలో చర్చించే అవకాశలున్నాయి. అదేదో జరిగిపోతే జగన్ కు లాభమో నష్టమో తేలిపోతుంది. ఇఫ్పటికైతే అసలు ఫెడరల్ ఫ్రంట్ అన్నదానికి ఓ షేప్ రాలేదన్నది వాస్తవం. మరి జగన్ కు ఈ విషయం తెలీకుండానే ఉంటుందా. చూద్దాం ఏం జరుగుతుందో.