ఇచ్చిన మాట నిలుపుకోవటం చాలా కష్టం. చాలామంది ఏదో అవరసరానికి మాట ఇచ్చేస్తారు. అవసరం తీరిపోయిన తర్వాత ఇచ్చిన మాటను మరచిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. మాట ఇస్తే నిలుపుకోవాలన్నదే జగన్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాజాగా ఎంఎల్సీలకు ఎంపిక చేసిన ముగ్గురు నేతల విషయం చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.
వైసిపికి వచ్చే మూడు ఎంఎల్సీ స్ధానాల్లో మోపిదేవి వెంకటరమణ, మోహ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిని జగన్ తాజాగా ఎంపిక చేశారు. మిగిలిన ఇద్దరి విషయాన్ని పక్కనపెట్టినా చల్లా విషయమే ఇక్కడ కీలకం. మొన్నటి ఎన్నికలకు ముందు మాత్రమే మాజీ ఎంఎల్ఏ చల్లా వైసిపిలో చేరారు. వెంటనే బనగానిపల్లె టికెట్ ఆశించారు. అయితే జగన్ కుదరదని స్పష్టంగా చెప్పేశారు.
పార్టీలో ఎప్పటి నుండో ఉన్న కాటసాని రామ్ భూపాలరెడ్డిని కాదని చల్లాకు టికెట్ ఇవ్వలేనని చెప్పారు. కాటసానిని గెలిపిస్తే, పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఎంఎల్సీ పదవిని ఇస్తానని మాటిచ్చారు. అంతుకుముందు చంద్రబాబునాయుడు కూడా ఇలాగే మాటిచ్చి దెబ్బకొట్టారు. అయినా జగన్ ను చల్లా నమ్మారు. అందుకే చిత్తశుద్దితో కాటసాని గెలుపుకు కష్టపడ్డారు. దానికి తగ్గట్లే కాటసాని మంచి మెజారిటితో గెలవటమే కాకుండా పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది.
ఇపుడు ఎంఎల్సీల భర్తీ అవకాశం రాగానే వెంటనే జగన్ పిలిచి మరీ చల్లాకు అవకాశం ఇచ్చారు. దాంతో చల్లా ఆనందం అంతా ఇంతా కాదు. మోపిదేవి, ఇక్బాల్ అంటే మొన్నటి ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయారు. అయితే ప్రత్యక పరిస్ధితుల్లో మోపిదేవిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు కాబట్టి వెంటనే ఎంఎల్సీని చేస్తున్నారు. అలాగే మైనారిటి నేత కాబట్టే ఇక్బాల్ కు అవకాశం ఇస్తున్నారు.