YS Jagan: నాపై నమ్మకం ఉంచండి… ఎవరు పార్టీని విడొద్దు… నేతలను బ్రతిమాలుతున్న జగన్?

YS Jagan: వైయస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో కీలక నేతలనైన మంత్రులను తాడేపల్లి ఆఫీస్ లోకి అడుగుపెట్టిన ఇచ్చేవారు కాదు ఏ విషయమైనా సజ్జల వరకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది కానీ జగన్ మోహన్ రెడ్డి దర్శనం మాత్రం అయ్యేది కాదు. ఒకప్పుడు అధికారులు అందరిచేత నేతలు అందరి చేత మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పించుకున్న జగన్ మాత్రం ఇప్పుడు మీరే మాకు దిక్కు అనే స్థాయికి చేరుకున్నారు.

అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నేతలనైనా లెక్క చేసేవారు కాదు దీంతో ఈయనకు గత ఎన్నికలలో ప్రజలు కూడా ఓటు రూపంలో తన స్థాయి ఏంటి అనేది తెలియజేశారు. ఇలా కేవలం 11 స్థానాలకు మాత్రమే జగన్ రెడ్డి పరిమితం కావడంతో ఎంతోమంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

ఈ విధంగా పార్టీ నుంచి చిన్నచిన్న నాయకుల నుంచి మొదలుకొని కీలక నేతల వరకు వలసలు వెళ్లడంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆత్మీయ సమావేశాలను ఏర్పాటు చేసే నేతలు అందరిని బుజ్జిగించే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. తనకు కంచుకోట అయినటువంటి కడపలో కూడా పెద్ద ఎత్తున వలసలు వెళ్లడంతో ఈయన నేతలందరిని బుజ్జగిస్తున్నట్టు తెలుస్తుంది.

నాపై ప్రతి ఒక్కరూ నమ్మకం పెట్టుకోండి ఏ ఒక్కరు కూడా పార్టీని వీడి వెళ్లదు అంటూ ఈయన బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రులను మంత్రులను సైతం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లోకి అడుగుపెట్టనివ్వని జగన్ ఇప్పుడు చిన్న చిన్న నాయకులకే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తు చేసుకొని నేను పడిన కష్టాన్ని గుర్తించాలి అంటూ చెప్పుకు వస్తూ అందరిని బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈయన ప్రయత్నాలు సక్సెస్ అయ్యేనా లేదా అనేది తెలియాల్సి ఉంది.