YS Jagan: నాలో ఉన్న సమస్య అది… సమయం వచ్చింది… జిల్లాలలోని నిద్ర చేస్తా: వైయస్ జగన్

YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఈయన నేతలకు దిశా నిర్దేశాలు చేశారు.జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుంది. జిల్లాల్లో నేను నిద్ర చేస్తాను. ప్రతి పార్లమెంటులో ప్రతి బుధ, గురువారాల్లో నిద్ర చేస్తాను. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతానని తెలిపారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అవుతుంది అయితే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఇచ్చిన మాటను తప్పారు.. ప్రజల తరపున పోరాడే సమయం ఆసన్నమైంది అంటూ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. మనం ఓడిపోయిన ఇప్పటికి ప్రజల ముందుకు ఎంతో గర్వంగా వెళ్లగలము అందుకు కారణం మనం చేసిన మంచేనని మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దాదాపు 95% పూర్తి చేశామని జగన్ తెలిపారు.

ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అసత్య హామీలు ఇచ్చారు. మనం లబ్ది చేస్తుంటే వాళ్లు చేస్తామని అబద్దాలు చెబుతున్నారని మన పార్టీ వారు అప్పట్లో చెప్పారు. అతి నిజాయితీ, అతి మంచితనం నాలో ఉన్న సమస్య అని మన పార్టీ వాళ్లు చెప్పారు. అతి నిజాయితీ అతి మంచితనం పనికిరాదని చెప్పిన ఆ నిజాయితీ మంచితనమే మనల్ని గెలిపిస్తుందని నమ్మానని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏ పథకం ఏ నెలలో విడుదల చేస్తాము అనేది బడ్జెట్ సమావేశాలలోనే చెప్పి మరి అదే సమయానికి లబ్ధిదారుల ఖాతాలో జమచేశాం. చరిత్రలో వైసిపి ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగిందని ఇంత మంచి చేసిన కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కారణాలను పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే, ఈ సారి 40 శాతం వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అందుకే పొరపాటున చెయ్యి అటు పోయింది అంటూ జగన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.