జగన్ లేఖాస్త్రం జగన్ మీదకే తిరగబడిందా.. కేసు పెట్టేస్తారా ?

YS Jagan in trouble with letter to CJI

ఏపీ సీఎం వైఎస్ జగన్ న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.  అయితే ఈ లేఖ రాసి జగన్ తప్పు చేశారా, సరైన పనే చేశారా అనే మీమాంస ప్రజల్లో తెగ గుబులు రేపుతోంది.  ఒక వర్గం మీడియా జగన్ చేసింది చరిత్రలో నిలిచిపోయే గొప్ప కార్యమని అంటే ఇంకొక వర్గం మీడియా మాత్రం జగన్ చేసింది ముమ్మాటికీ తప్పే అంటూ వాదిస్తోంది.  ఈ వ్యవహారం మీద అనేక మంది న్యాయనిపుణులు, న్యాయవాదులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చగా ఇప్పటికీ ఒక స్పష్టమైన అంచనా అనేది రాలేదు.  

YS Jagan in trouble with letter to CJI
YS Jagan in trouble with letter to CJI

కానీ తాజాగా ఈ లేఖ గురించి అటార్నీ జనరల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.  జగన్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మీద ఆరోపణలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కోర్టు ధిక్కరణ చర్యే అని ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక న్యాయవాది అటార్నీ జగనర్ కు లేఖ రాశారు.  అయితే అటార్నీ జనరల్ ఈ వ్యవహారం సీజేఐ పరిధిలో ఉంది కాబట్టి తాము ఎలాంటి చర్యలో తీసుకోలేమని అన్నారు.  ఇది వైసీపీ వర్గాలకు ఆనందాన్ని ఇస్తే ఈ వ్యాఖ్యలకు ముందు అటార్నీ జనరల్ జగన్ లేఖ రాయడం కరెక్ట్ కాదంటూ చెప్పడం టీడీపీ వర్గాలకు ఉత్సాహాన్ని ఇస్తోంది.  

ఇక్కడ ఎవరి ఫీలింగ్ ఎలా ఉన్నా అటార్నీ జనరల్ జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని అనడంతో లేఖాస్త్రం సీన్ మొత్తం రివర్స్ అవుతోందా అనే అనుమానాన్ని కలిగిస్తోంది.  ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారణ చేయాలనే ఎన్వీ రమణ తీర్పు అనంతరం జగన్ లేఖను సంధించడం దాన్ని బహిరంగంగా బయటకు వదలడం వెనుక అనుమానాలున్నాయని, ఆయన లేఖలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఇది కావాలని అధికార వ్యవస్థల మీద అవిధేయత ప్రదర్శించడమేనని, కోర్టుల మీద ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటే అది ధిక్కరణే అవుతుందని చెప్పుకొచ్చారు.  దీన్నిబట్టి   జగన్ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఫెయిల్ అయ్యే అవకాశం లేకపోలేదని   అనిపిస్తోంది.