రాజకీయాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న అనుభవం చాలా తక్కువ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పోలిస్తే బాబు యొక్క రాజకీయం అనుభవం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు సమానంగా ఉంటుంది. వైఎస్ జగన్ కు రాజకీయ అనుభవం తక్కువే కానీ ఆయన మోస్తున్న బాధ్యతలు మాత్రం చాలా బరువైనవి. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే వైసీపీ పార్టీ యొక్క బాధ్యతలు కూడా ఒక్కడే మోస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను , పార్టీకి చెందిన సమస్యలను కేవలం ఒక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు తాను మోస్తున్న ఒక అతిపెద్ద బాధ్యతను మరొకరికి అప్పగించడాని వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
పార్టీ బాధ్యతలను వేరొకరికి అప్పగించనున్నారా !
వైసీపీ పార్టీ యొక్క బాధ్యతలను తన పార్టీలోనే ఎవరో ఒక నాయకుడికి ఇవ్వడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఎందుకంటే ఒక్కడే పార్టీ భాధ్యతలను, రాష్ట్ర బాధ్యతలను చూసుకోవడం కష్టం. అలాగే ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితులు కూడా చాలా దయనీయంగా ఉన్నాయి. అప్పుల రాష్ట్రం, కరోనాతో కుదేలయిన రాష్ట్రం. ఒక గాడిన పెట్టాలంటే మొత్తం టైం పాలనకు ఇచ్చేసినా సరిపోదు. దాంతో జగన్ తనకు పార్టీ బాద్యతలు అవసరం లేదని అంటున్నారని టాక్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా పార్టీ యొక్క బాధ్యతలను కొడుకు నారా లోకేశ్ కు అప్పగించి, తాను పాలనలో బిజీగా ఉండేవారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా పార్టీ బాధ్యతలు మరొకరికి అప్పగించనున్నారు.
పార్టీ ప్రెసిడెంట్ పదవి కూడా ఆ కుటుంబానికేనా!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ది రెడ్డి కుటుంబంతో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రిని చేశారు. ఆయన సోదరుడిని ఎమ్మెల్యే చేశారు. ఇక కుమారుడు మిధున్ రెడ్డిని లోక్ సభలో పార్టీ లీడర్ ని చేశారు. ఇపుడు మిధున్ రెడ్డికే ఏపీ వైసీపీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తున్నారని సమాచారం. పెద్దిరెడ్డి కుటుంబంతో తనకు ఎలాగో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తాను సీఎంగా రాష్ట్రం యొక్క బాధ్యతలు నిశ్చింతగా నిర్వహించవచ్చని జగన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.