జ‌గ‌న్ ఫుల్లు హ్యాపీ

పాద‌య‌త్ర‌లో ఉన్న వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే, ఈరోజు సాయంత్రం త‌న ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో 3 వేల కిలోమీట‌ర్ల రికార్డును అధిగ‌మించారు. పాద‌యాత్ర పూర్వ‌య్యే స‌మ‌యానికి జ‌గ‌న్ గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కినా ఎక్క‌వ‌చ్చు. ఎందుకంటే, ప్ర‌పంచంలో అంత సుదీర్ఘ‌కాలం, అంత దూరం పాద‌యాత్రను ఎవ‌రూ చెయ్య‌లేదు.

ప్ర‌జాభిమాన‌మే త‌న‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ న‌డిపిస్తోందంటూ జ‌గన్ బ‌హిరంగ‌స‌భ‌లో చెప్పుకోవ‌టం చూస్తే నిజ‌మే అనిసిస్తోంది. పోయిన ఏడాది న‌వంబ‌ర్ 6వ తేదీన క‌డ‌ప జిల్లాలోని పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం ఇడుపుల‌పాయ‌లో మొద‌లైన పాద‌యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని శృంగ‌వ‌రపు కోట నియోజ‌క‌వ‌ర్గం కొత్త‌వ‌ల‌స మండలంలోని దేశ‌పాత్రునిపాలెం గ్రామంలో 3 వేల కిలోమీట‌ర్లను అధిగ‌మించింది. అందుక‌నే జ‌గ‌న్ పిచ్చ సంతోషంగా ఉన్నారు. ఆ సంద‌ర్భంగా జిల్లాలోని వైసిపి నేత‌లు ఏర్పాటు చేసిన భారీ పైలాన్ ను జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.

త‌న సుదీర్ఘ పాద‌యాత్ర‌లో త‌న‌తో పాటు ఎక్క‌డిక‌క్క‌డ జ‌నాలు కూడా న‌డుస్తుండ‌టం, త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుంటే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు కూడా సూచిస్తుండ‌టం త‌న‌కు చాలా సంతోషాన్ని క‌లిగిస్తున్న‌ట్లు చెప్పుకున్నారు. ప్ర‌జ‌లు త‌న‌పై చూపుతున్న అభిమానం, ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోన‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్ లో చెప్పుకున్నారు.