ఎంఎల్సీలుగా ముగ్గురు ఫైనల్

వైసిపి తరపున ముగ్గురు ఎంఎల్సీలను జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ఎంఎల్ఏ అభ్యర్ధులకు, పోటీ చేసే అవకాశం దక్కని ఓ సీనియర్ మాజీ ఎంఎల్ఏ చల్లా రామకృష్ణారెడ్డికి ఎంపిక చేశారు. ఈ మేరకు పొద్దునే వైసిపి కేంద్ర కార్యాలయం నుండి ఓ ప్రకటనలో వచ్చింది.

మొన్నటి ఎన్నికల్లో  మోడిదేవి వెంకటరమణ, మొహ్మద్ ఇక్బాల్ లు గుంటూరు జిల్లాలోని రేపల్లె, అనంతపురం జిల్లాలోని హిందుపురం నుండి పోటీ చేశారు. అయితే ఇద్దరూ ఓడిపోయారు. అదే సమయంలో కోయిలకుంట్లలో పోటీ చేయటానికి చల్లా ప్రయత్నించగా జగన్ టికెట్ ఇవ్వలేదు. అయితే ఎంఎల్సీగా అవకాశం ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు.

ఎంఎల్ఏగా ఓడిపోయిన మోపిదేవికి మంత్రిపదవి ఇచ్చారు కాబట్టి ఎంఎల్సీగా ఎంపిక చేయటం అవసరం. జగన్ తో పాటు కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం కూడా గడిపారు కాబట్టి మోపిదేవికి మంత్రిపదవి ఇచ్చారంటే అర్ధముంది . మరి ఇక్బాల్ కు ఎంఎల్సీగా ఇస్తున్నారో అర్ధం కావటం లేదు. ఎంఎల్ఏగా  చివరినిముషంలో హిందుపురంలో టికెట్ ఇవ్వటమే తప్పంటే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎల్సీగా అవకాశం ఎందుకో జగనే చెప్పాలి.

అంతగా మైనారిటి నేతకు ఇవ్వాలని అనుకుంటే మరో నేతకు ఇచ్చుండచ్చు. సరే చల్లాకు ఇవ్వటంలో ఎక్కడా అభ్యంతరాలు వినబడటం లేదు లేండి. మొత్తం మీద ఎంఎల్సీ పదవుల పందేరంలో కూడా జగన్ సామాజికవర్గం సమతూకం పాటించినట్లైంది. ఓ బిసి, మైనారిటి, రెడ్డి సామిజికవర్గాలకు పదవులు కేటాయించారు. భవిష్యత్తులో రాబోయే మరో ఐదు ఎంఎల్సీలను ఎవరికి ఇస్తారో చూడాలి.