సుప్రీం కోర్ట్ లో జగన్ పెద్ద ఎదురుదెబ్బె కానీ ఇక్కడ ప్రభుత్వానికి మంచి కూడా జరిగిందా ..!

స్వర్ణా ప్యాలెస్ యాక్సిడెంట్ కేసులో జగన్ అత్యవసర ఆదేశాలు .. అతిపెద్ద ఛేజింగ్ నడుస్తోంది.

వైసీపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ దగ్గర మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 100సార్లు కోర్ట్ ల నుండి చివాట్లు తింటూనే ఉంది. డాక్టర్ సుధాకర్ విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో, ఎన్నికల కమిషినర్ రమేష్ కుమార్ విషయంలో, ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ఇలా చాలాసార్లు ప్రభుత్వానికి కోర్ట్ ల నుండి చిక్కులు ఎదురు అయ్యాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్య అమలుపై రాష్ట్రంలో హై కోర్ట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది. అయితే నిన్న ఈ విషయంపై సుప్రీం కోర్ట్ విచారణ చేపట్టింది. హై కోర్ట్ ఇచ్చిన తీర్పును తాము మార్చలేమని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది.

ap cm ys jagan serious warning to his mlas
ap cm ys jagan serious warning to his mlas

ఈ తీర్పుతో వైసీపీ ప్రభుత్వానికి మరో చిక్కు ఎదురైంది. దీనిపై ఇంకా ఏవైనా క్యావిట్ పిటిషన్ ఉంటే దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ సెప్టెంబర్ 25కు విచారణ వాయిదా వేసింది. ఇలా కోర్ట్ ల దగ్గర చివాట్లు తింటున్న వైసీపీ ప్రభుత్వం యొక్క గౌరవం జాతీయ రోజురోజుకు సన్నగిల్లుతుంది.

అయితే ఈసారి వచ్చిన చిక్కుల్లో మాత్రం ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి మంచే జరిగింది. విద్యా హక్కు చట్టంలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదని ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని విశ్వనాథన్ వాదనలు వినిపించారు. తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని న్యాయవాది విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారిక భాషల చట్టం-1963 ప్రకారం ఇంగ్లీష్, హిందీలోనే ప్రభుత్వ ప్రకటనలను జారీ చేస్తుందని, అలాంటప్పుడు ఇంగ్లీష్ విద్య బోధన చేస్తే తప్పేంటని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారిక భాషల చట్టం-1963 ప్రకారం హిందీ, ఇంగ్లీష్ అధికారిక బాషాలుగా ఉన్నాయని, ఈ చట్టంలో స్వల్పమార్పులు చేసి రీజినల్ బాషాలను కూడా చేర్చాలని సుప్రీం గతంలో తీర్పు వెల్లడించింది. కేంద్ర చేస్తే తప్పు కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పేలా అవుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొంటున్నారు. ఈ వాదన ప్రభుత్వానికి కలిసి వస్తుంది.