ముందస్తుపై కొత్త చర్చ… మంత్రులకు జగన్ చెప్పిందిదే!

ఈ ఏడాది జగన్ ఢిల్లీ వెళ్లినప్పటినుంచి ముందస్తు ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. ముందస్తు గురించి మోడీతో ముచ్చటించడంకోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని.. మోడీ కూడా అనుమతి ఇచ్చేశారని.. రకరకాల కథనాలు వండి వడ్డించేస్తుంది ఒక వర్గం మీడియా.

ఇదే సమయంలో టీడీపీ నేతలు సైతం.. జగన్ ముందస్తుకు సిద్ధమని తమకు సమాచారం ఉందనే రేంజ్ లో కబుర్లు చెబుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో జగన్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో… ముందస్తుపై చర్చ కన్ ఫాం అని, మంత్రులకు ఒక మాట చెప్పి జగన్ ముందస్తుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు!

అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం తరువాత జగన్ మాట్లాడిన మాటలు ఆఫ్ ది రికార్డ్ గా ప్రచారంలోకి వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు అంటూ బయట జరుగుతున్న ప్రచారం మీద జగన్ వద్ద మంత్రులు ప్రస్తావించినపుడు అవేమీ పట్టించుకోవద్దని క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. అంతే కాదు ముందస్తు ఎన్నికలు అన్నవి విపక్షాల ట్రాప్ మాత్రమే అని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

అవును… షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసిన జగన్… ఎన్నికల ఏడాదిలో ప్రవేశించినందున ప్రతీ ఒక్కరూ తమ నియోజకవర్గాలతో పాటు జిల్లాలలో పార్టీని పటిష్టం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో విపక్షాలు వేస్తున్న ముందస్తు ట్రాప్ లోకి చిక్కుకోవద్దని కూడా ఆయన సూచించినట్లుగా చెబుతున్నారు.

ఇదే సమయంలో తాను ఏమి చేయాలో అన్నీ చేస్తానని.. తనకు ఆయా విషయాలు వదిలిపెట్టి మంత్రులు అంతా ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ దిశగా అడుగులు వేయాలని జగన్ కోరారని అంటుయ్న్నారు. మంత్రులు పదే పదే ముందస్తు ఎన్నికల విషయంలో డౌట్లని ప్రశ్నించినపుడు జగన్ ఈ మేరకు జగన్ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.

దీంతో ఇక ముందస్తు ముచ్చట లేదని ఒక క్లారిటీకి వచ్చేశారని సమాచారం. అయితే జగనన్న సురక్ష కార్యక్రమం బాగా అమలు అవుతోందని కితాబు ఇచ్చిన జగన్… అదే సమయంలో గడప గడపకు కార్యక్రమాన్ని కూడా కొనసాగించాలని మంత్రులను కోరారని తెలుస్తుంది.