ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యన పోలికలు పెరిగిపోయింది. ఇరు రాష్ట్రాల్లో పాలన ఎలా ఉంది, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, పేదలు, రైతులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారు అనే పలు అంశాల్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరును బేరీజు వేస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో మొదటగా కేసీఆర్, చంద్రబాబు నాయుడును పోల్చి చూడటం స్టార్ట్ చేశారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ మంచి పనితనం ప్రదర్శించారు. పలు రకాల సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. రైతు బంధు లాంటి పథకంతో దేశం దృష్టిని ఆకర్షించారు. అందుకే రెండోసారి మొదటిసారి కంటే ఎక్కువ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు చంద్రబాబు మీద మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి.
కేసీఆర్ పనితనాన్ని చూపించి చంద్రబాబును ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ఆయనలోని కమిట్మెంట్ చంద్రబాబులో లేదని అన్నారు. అందుకే గత ఎన్నికలో 23 సీట్ల వరకే పరిమితం చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సీన్ రివర్స్ అయింది. జగన్ చేస్తున్న పనులు చూపిస్తూ కేసీఆర్ మీద విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశారు అక్కడి జనం, నాయకులు. జగన్ పలురకాల పథకాలతో నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తున్నారు. పైపెచ్చు పేదలకు ఉచితంగా భూ పట్టాలను ఇస్తున్నారు. ఈ పట్టాల అంశంలోనే కేసీఆర్ మీద ఒత్తిడి పెరుగుతోంది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పోడు వ్యవహస్యం చేసుకుంటున్న గిరిజన రైతులకు భూపట్టాలు ఇవ్వాలని సంకల్పించారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి కూడ.
దీంతో ఏపీలో గిరిజనులు సంతోషంలో ఉన్నారు. అదే టైంలో తెలంగాణలో గిరిజనులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న వారి భూముల్లో అటవీశాఖ అధికారులు, పోలీసులు హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారు. దీంతో పంటలు ధ్వంసమవుతున్నాయి. దశాబ్దాల తరబడి పోడు భూములను సాగుచేసుకుంటున్న భూములను ఇలా లాగేసుకుంటే ఎక్కడికి పోవాలని వాపోతున్నారు వారంతా. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 89 వేలమంది రైతులకు 2.22 లక్షల ఎకరాల భూమిని పంచింది. అయితే వాటిలో కొన్నింటికి పట్టాలు లేవు. తెలంగాణ పరిధిలో ఉన్న అలాంటి భూములే ఇప్పుడు సమస్యగా మారాయి.
దాదాపు 60 వేల ఎకరాల్లో పోదు భూములను సాగు చేస్తున్న రైతులు అటవీశాఖ చర్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే శాశ్వత పట్టాలు ఇవ్వాలని గిరిజనులు పట్టుబడుతున్నారు. గిరిజన నాయకులైతే పక్క రాష్ట్రం ఆంధ్రాలో వైఎస్ జగన్ భూ పట్టాలు ఇస్తుంటే కేసీఆర్ ఎందుకు ఇవ్వలేకున్నారని అడుగుతున్నారు. గిరిజనులు అయితే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జోలికి ఎవ్వరూ రాలేదు. ఇప్పడు భూములు వదిలి పొమ్మంటున్నారు. అవతల జగన్ ఏమో ఆంధ్రాలో గిరిజన్లకు పట్టాలిస్తున్నారు, మాకు కూడ ఆయనే ముఖ్యమంత్రి అయ్యుంటే బావుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.