YS Jagan: జగన్ చేసింది కూడా చెప్పుకోలేకపోయాడు… కడపలో సంచలనం రేపిన ఫ్లెక్సీ!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో అద్భుతమైన పరిపాలన అందించారు కేవలం ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందకుండా గ్రామస్థాయి నుంచి అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్క పేద కుటుంబం సంతోషంగా ఉండాలని తపించారు. అందుకు అనుగుణంగానే ఎన్నో రకాల పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు అయితే ఆయన చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం చేతకాకే ఓడిపోయారు అంటూ కడపలో ఒక ఫ్లెక్సీ వెలిసింది.

జగన్ కి చేసింది చెప్పుకోవడం చేతకావడం లేదంటూ కడప యాసలో ఉన్న ఈ ఫ్లెక్సీపై ఓ టేబుల్ రహో సహా గత చంద్రబాబు ప్రభుత్వంలో 2018-2019 లో వైయస్ జగన్ హయాంలో చివరి ఆర్థిక సంవత్సరంగా ఉన్నటువంటి 2023-2024 లో రాష్ట్రంలో నమోదైన వార్షిక ఆదాయం గురించి డేటాతో సహా ఉండటం ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు హయాంలో 2018-19 మధ్యలో రాష్ట్ర జాతీయోత్పత్తి 7.9 లక్షల కోట్లు ఉండగా.. జగన్ హయాంలో 2023 నుండి 2024 వరకు 12.91 లక్షల కోట్లకు పెరిగిందంటూ ఫ్లెక్సీలో ఉంది.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ.. ఫ్లెక్సీ చివరిలో మాత్రం వైసీపీకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఏదో ఫ్రెండ్షిప్ కారణంగానే చెప్పాలనిపించి చెప్పాను. అని ఉండటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అసలు ఈ ఫ్లెక్సీ ఎవరు వేసి ఉంటారు అంటూ మున్సిపాలిటీ వారు ఎంక్వయిరీస్ మొదలుపెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఉన్నది 100కు 100% నిజం జగనన్న చాలా మంచి పని చేశారు కానీ ఆయనకు చెప్పుకోవడం చేతకాక ఓడిపోయారని ఇప్పటికే ఎంతోమంది విశ్లేషకులు కూడా తెలియజేశారు.

ఇక మరోవైపు కూటమి నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని పెద్ద ఎత్తున అప్పులు చేశారంటూ మండిపడుతూ వచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచారు. తీరా గెలిచిన తర్వాత పథకాలు ఇవ్వాలంటే డబ్బులు లేవు అని భజన చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వ తీరుపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది.