వైసీపీలో పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చినప్పుడు ఒకలా తయారయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటి మీద నడిచిన నేతలంతా పదవుల్లో కూర్చున్నాక ఎవరి దారి వారిదన్నట్టు ఉంటున్నారు. గతంలో జగన్ ఏది చెబితే అది శాసనంగా నడిచింది. నాయకుల సొంత నిర్ణయాలకు చోటు ఉండేది కాదు. అదే పార్టీని అధికారం వైపు నడిపోంచిందనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. కొన్ని విషయాలు అసలు జగన్ వరకు వెళ్లట్లేదట. వెళ్లినా ఆయన చెప్పింది జరగడంలేదట. ఈ పరిస్థితి ఆనాటి నాయకుల విషయంలో లేకపోయినా జగన్ కు అత్యంత సన్నిహితులన్న పేరున్న విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఉందట.
వైఎస్ జగన్ విశాఖను రాజధానిని చేయాలని అనుకోవడంతో జిల్లా వ్యవహారాలను చూసుకోవడానికి సమర్ధుడైన, నమ్మకమైన వ్యక్తి ఉంటే బాగుంటుందని విజయసాయిరెడ్డికి బాధ్యతలను అప్పగించారు. విజయసాయి కూడ ఉత్సాహంతో ఉత్తరాంధ్ర పనులను చూసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ ఉత్సాహం పోను పోను అత్యుత్సాహమైంది. సొంత పార్టీ నేతలు నుండే వ్యతిరేకత వ్యక్తమయ్యే స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేరుగా ఆనాటి ముందు విజయసాయిని ధిక్కరించారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సైతం విజయసాయి అతి జోక్యాన్ని తట్టుకోలేకపోతున్నారు.
మొదట్లో జగన్ విజయసాయి వైపు నుండే ఆలోచించినా మెల్లగా రూట్ మార్చారట. విజయసాయి మీద అసంతృప్తితో ఉన్న నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆలోచించిన ఆయనకు విజయసాయి మీద మునుపటి అభిప్రాయం ఒకింత తగ్గినట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విషయంలో విజయసాయి తీరు జగన్ కు కోపాన్ని తెప్పించిందనే అనాలి. గంటా పార్టీలోకి రావడాన్ని జగన్ సైతం స్వాగతించారు. ఆయనలాంటి బలమైన నాయకుడ్ని టీడీపీకి దూరం చేస్తే చంద్రబాబుకు విశాఖలో పట్టు పోయినట్టే అనుకున్నారు జగన్. కానీ గంటా వస్తే విశాఖ విషయంలో తన ప్రాముఖ్యత ఎక్కడ దెబ్బతింటుందోనని భావించిన విజయసాయి అవంతితో కలిసి అడ్డుకున్నారు.
జగన్ ఉద్దేశ్యాన్ని సైతం లెక్కచేయకుండా గంటా రాకకు బ్రేకులు వేశారు. చివరికి గంటాను భూములను కూడ ఆక్రమించుకున్నవే అంటూ రెవెన్యూ శాఖ స్వాధీనమా చేసుకుంది. అలా దీంతో గంటా కోపగించుకుని టీడీపీలోకి సర్దుకున్నారు. అలా జగన్ మనోగతానికి వ్యతిరేకంగా నడుచుకున్నారు విజయసాయి. ఈ కారణాలన్నీ వెరసి త్వరలో విజయసాయి చేతిలో ఉన్న విశాఖ పగ్గాలు వేరొకరి చేతిలోకి వెళ్లడం ఖాయమని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.