‘జయము జయము చంద్రన్న’లాంటి ఎపిక్ సీన్లు మళ్ళీ రిపీట్ కాబోతున్నాయి !

Yellow media restarts paid promotions for Chandrababu 
సొంత డబ్బా కొట్టుకోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును  మించినవారు లేరు.  హైప్ కోసం ఆయన చేసే పనులు ఒక్కోసారి చిత్ర విచిత్రంగా ఉంటుంటాయి.  పెయిడ్ ప్రమోషన్లకు ఎప్పుడూ ప్రథమ తాబూలం ఇస్తుంటారు ఆయన.  ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని లేని గొప్పలు చెప్పుకుంటుంటారు.  ఆ గొప్పలే గత ఎన్నికల్లో ఆయన కొంప ముంచాయి.  గొప్పలు చెప్పుకునే ప్రక్రియలో  జనాన్ని మభ్యపెట్టబోయి ఆయనే మభ్యపడిపోయారు.  బాబుగారి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ను అస్సలు తట్టుకోలేరనేది వాస్తవం.  అందుకే ఆయన చుట్టూ ఉన్నవారు కూడ ఉన్న చేదు వాస్తవాలు చెప్పి చీవాట్లు తినడం కంటే లేని గొప్పలు చెప్పేసి భుజం తట్టించుకుంటే మంచిదని పనిచేస్తుంటారు.  
 
Yellow media restarts paid promotions for Chandrababu
లేకపోతే గత ఎన్నికలకు ముందు టీడీపీ చేయించుకున్న సర్వేల్లో దాదాపు 75 శాతం మంది జనం మళ్ళీ టీడీపీ పాకనే రావాలి, చంద్రన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు ఫలితాలొచ్చాయి.  చంద్రబాబుగారు కూడ దాన్ని నమ్మేసి ఎన్నికలకు ముందు పలు సమావేశాల్లో అదే మాటను పదే పదే చెప్పుకున్నారు.  కానీ వాస్తవం ఏంటో జనాలకు తెలుసు కదా.  చివరికి ఫలితాల్లో 23 స్థానాలతో  సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  చంద్రన్న పాలనను కోరుకున్న ఆ 75 శాతం మంది జనం ఎటుపోయారో ఆయనక్కూడ తెలీదు.  తీరా ఎన్నికలు ముగిశాక ఫీడ్ బ్యాక్ ఇచ్చే బ్యాచ్ ను పట్టుకుని ఆరా తీస్తే అలవాటులో పొరపాటుగా అధిష్టానం ముందు కూడ ఫేక్ ప్రచారమే జరిగిపోయిందనే నిజం వెల్లడైంది.  దీంతో ఖంగుతినడం బాబుగారి వంతైంది.  
 
ముఖ్యమంత్రిగా ఉండగా ఎల్లో పత్రికల్లో, ఛానెళ్లల్లో బాబుగారిని కీర్తించే కార్యక్రమాలు ఏ లెవల్లో ఉండేవో ఒక్కసారి గుర్తిచేసుకుంటే నవ్వొస్తుంది.  బాబు వస్తే జాబు వస్తుంది, చంద్రబాబే దైవం, ప్రతి ఇంటికీ పెద్ద కొడుకు లాంటి పెయిడ్ ప్రమోషన్స్ వేరే లెవల్లో జరిగేవి.  ఇక అమరావతి గురించిన ప్రచారమైతే అంతా ఇంతా కాదు.  బాబుగారు దేశం నివ్వెరపోయే నగరం కడుతున్నారంటూ బాకాలు  ఊదారు.  ఇప్పుడు ఆ అమరావతే రాజధానిగా లేకుండా పోయేంత బలహీనంగా  అప్పట్లో చంద్రబాబుగారి పనితీరు ఉండిందని అర్థమవుతోంది.   ఇక ‘జయము జయము చంద్రన్న’ లాంటి భజన కార్యక్రమాల గురించి చెప్పాల్సిన పనే లేదు.  స్వయంగా ముఖ్యమంత్రి జగనే అసెంబ్లీలో ఆటవిడుపు కోసం ఆ వీడియోలు  వేయించుకుని కడుపుబ్బా నవ్వుకున్నారు. 
 
ఇంత జరిగాక కూడ ఎల్లో మీడియా ఈ ఫేక్ ప్రచారాన్ని వదలట్లేదు.  మరోసారి  బాబుగారిని జనంలో దేవుడిలా ప్రొజెక్ట్ చేసే ప్రక్రియను మొదలుపెట్టారు.  శుక్రవారం చంద్రబాబుగారు అసెంబ్లీ నుంచి వెళ్తూ మందడంలో శిబిరాన్ని సందర్శించారు.  ఈ సందర్భాన్ని పచ్చ మీడియా చంద్రబాబు కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో రైతులు దాన్ని గమనించి ఉన్నపళంగా రెండు చేతులు పైకెత్తి దండాలు పెట్టారు అంటూ తిరుమల క్యూ లైన్లో భక్తులు శ్రీవారిని చూడగానే గోవిందా గోవిందా అంటూ చేతులెత్తి మొరపెట్టుకునే సీన్ గుర్తొచ్చే లెవల్లో చెప్పుకొచ్చారు.  ఎల్లో మీడియా ఊపు చూస్తుంటే జయము జయము చంద్రన్న లాంటి ఎపిక్ సీన్లు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయేమోనని అనిపిస్తోంది.