2024 ఎన్నికల్లో కూడా వైసీపీదే విజయం.. ఆ సర్వేలో ఏం వెల్లడైందంటే?

YCP-1

2024 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకపోవచ్చని ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోందని సోషల్ మీడియాలో జోరుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న జగన్ మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. అయితే టీడీపీ జనసేన మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఫలితాలు కచ్చితంగా మారతాయని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

అయితే ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికల్లో జగన్ కు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని వెల్లడైంది.ఏకంగా 57 శాతం మంది ఏపీ ప్రజలు జగన్ కు అనుకూలంగా ఉన్నారని ఆ సర్వేలో తేలింది. 126 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. 18 నుండి 19 ఎంపీ స్థానాలలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అయితే 2024 ఎన్నికల సమయానికి ఈ ఫలితాలలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. సలహాదారుల నియామకం విషయంలో జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో సలహాదారులు ఎందుకని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జగన్ సర్కార్ మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకెళుతోంది. మరోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న జీవోల విషయంలో కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

మరోవైపు ఇతర పార్టీల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తుండగా ఏం జరగనుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందో ఏ విధంగా ముందడుగులు వేయబోతుందో చూడాల్సి ఉంది.