మోదీపైనే వైసీపీ పరువు ఆధారపడి ఉందా.. అసలేం జరిగిందంటే?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైసీపీ విషయంలో మరీ పాజిటివ్ గా లేరు మరీ నెగిటివ్ గా లేరనే సంగతి తెలిసిందే. అయితే బీజేపీ సర్కార్ నుంచి సకాలంలో నిధులు అందడం వల్లే వైసీపీ సర్కార్ ప్రస్తుతం మనుగడ సాగిస్తోంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమవుతోందనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీకి అప్పులు పుట్టడం సులువు కాదు. అయితే కేంద్రం మద్దతు ఉంటే మాత్రం వైసీపీకి అనుకూలంగా అన్నీ జరుగుతాయి.

వైసీపీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ఇప్పటికే హద్దులు దాటేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లెక్కలు చెప్పకుండా జగన్ సర్కార్ వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తుండటంపై ప్రజల నుంచి కూడా ఊహించని స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ సర్కార్ ఆదాయం పెరగడం కోసం ప్రభుత్వం అప్పులు చేస్తే బాగుండేదని కానీ జగన్ సర్కార్ వృథా ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 22వ తేదీన వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేయడానికి జగన్ సర్కార్ సిద్ధమైంది. ఈ పథకం ద్వారా జగన్ సర్కార్ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళల ఖాతాలలో ఈ మొత్తాన్ని జమ చేస్తుండటం గమనార్హం.

జగన్ సర్కార్ పొదుపు దిశగా అడుగులు వేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పొదుపు దిశగా అడుగులు వేయని పక్షంలో భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు కేంద్రం జగన్ సర్కార్ పై రాబోయే రోజుల్లో కూడా కరుణ చూపుతుందో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.