పవన్ కళ్యాణ్‌కి జాకీలేస్తున్న వైసీపీ.! ఇదీ వ్యూహాత్మకమేనా.?

అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనమయ్యారంటే, దానికి కారణమేంటి.? వున్నపళ:గా వైసీపీ వర్సెస్ జనసేన మాత్రమే.. అనే స్థాయికి పొలిటికల్ వార్ ఎందుకు చేరింది.?

జనసేనాని పవన్ కళ్యాణ్, వైసీపీ వాలెంటీర్ వ్యవస్థని సవాల్ చేయడంతో.. వైసీపీకి అది అడ్వాంటేజ్ అయ్యింది. వాలంటీర్లను ఉత్సాహపరిచేలా వైసీపీ, పవన్ కళ్యాణ్ మీదకు కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ అనేది ఎక్కడా కనిపించకుండా పోయింది. దాంతో, చంద్రబాబు కూడా వాలంటీర్ల గురించి వింత వింత వాదనలు వినిపించడం మొదలు పెట్టారు.

టీడీపీ మహిళా నేత అనిత, వాలంటీర్ వ్యవస్థ మీద చేసిన వ్యాఖ్యలతో.. టీడీపీ మరింత దిగజారిపోయిన సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారింది.

ఒకే విమర్శ పదే పదే చేయడం కాకుండా, వారాహి విజయ యాత్రలో.. చాలా అంశాల్ని జనసేనాని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాలు కొంత వైసీపీకి కూడా సంకటంగా మారుతున్న మాట వాస్తవం. అయినాగానీ, టీడీపీ కంటే జనసేననే ప్రధాన ప్రత్యర్థి అయితే బావుంటుందన్న భావనలో వైసీపీ వున్నట్లే కనిపిస్తోంది.

టీడీపీ – జనసేన పొత్తు వుండకూదని వైసీపీ బావిస్తోంది. జనసేన కాస్త బలోపేతమైతే, ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తుంది.. దానికి టీడీపీ ఎలాగూ అంగీకరించదు. ఇదే వ్యూహంతో వైసీపీ వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. అధికార పార్టీ తాజా వ్యూహం ఎలాంటి పొలిటికల్ ఈక్వేషన్‌కి కారణమవుతుందో ఏమో.!