అధికార వైసీపీ పార్టీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో మాత్రం దీనికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ఒక మాజీ ఎంపీ అలాగే ఆయన కుమారుడు ఇప్పుడు పార్టీలో అసహనంగా ఉన్నారని అంతేకాకుండా కొంతమంది రెడ్డి సామాజికవర్గం నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ భజన చేసే వాళ్లకు మాత్రమే పార్టీలో విలువ ఉందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది.
అంతే కాకుండా ప్రభుత్వంలో కొంతమంది ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వారి కారణంగా పార్టీలో విభేదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించకాపోతే క్షేత్ర స్థాయిలో కూడా నష్టపోయే అవకాశం ఉందని కొంతమంది హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని కాబట్టి బీజేపీ లోకి వెళ్తే పడే అవకాశం ఉండదని భావించిన కొంత మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఎలాగూ వైసీపీతో టచ్ లో ఉంటారు కాబట్టి వారితో చర్చలు జరిపి ఉపయోగం లేదని అందుకే బీజేపీ రాజ్యసభ ఎంపీలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. రాష్ట్రానికి చెందిన ఒక రాజ్యసభ ఎంపీతో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు చర్చలు జరిపారని తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటనేది త్వరలో స్పష్టత వస్తుంది. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం అధికార వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల ఎంపీ కూడా ఒకరు పార్టీ మారే అవకాశం ఉంది అని అంటున్నారు.