మిస్టర్ నిమ్మగడ్డ   .. అంటూ పిచ్చ కోప్పడుతున్నారు వాళ్ళంతా.

అక్కడ జరిగేదాన్ని బట్టి నిమ్మగడ్డ భవిష్యత్తు డిపెండ్ అవుతుంది !

ప్రభుత్వం తో సంప్రదింపులు జరపకుండా .. ఏకపక్ష నిర్ణయం తీసుకున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ ‌కుమార్‌ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ నిర్ణయంపై మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శ్రీరంగనాథరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఎజెండాతోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని మండిపడ్డారు. ఇందులో కుట్రకోణం దాగుందని , ప్రజల ఆరోగ్యంతో ఆదుకోవడం మంచిది కాదు అని అన్నారు.

national media covered in various ways on highcourt questioning nimmagadda ramesh

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు. నిమ్మగడ్డ ఎవరి డైరెక్షన్‌లో నిర్ణయాలు తీసుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఈ ఎన్నికల షెడ్యూల్‌ వెనక కుట్ర కోణం ఉంది అని మంత్రి కన్నబాబు అన్నారు. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు.

ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది.

ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇక నిమ్మగడ్డ ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్నట్లు ఉందని కరణం ధర్మశ్రీ విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడొద్దని విజ్ఞప్తి చేశారు. అనంత వెంకటరామిరెడ్డి స్పందిస్తూ.. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.