ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు క్లారిటీ !

ap highcourt judgement over election commission petition

ఏపీలో పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నదానిపై రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ మెగా విక్టరీ పై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలువురు మంత్రులకు తిరుపతి ఉప ఎన్నిక బాధ్యత అప్పగించిన అధినేత జగన్.. కనీసం 4 లక్షల మెజార్టీ రావాలని టార్గెట్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే జోష్ లో పరిషత్ ఎన్నికలు కూడా నిర్వహిస్తే.. భారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను సొంతం చేసుకోవచ్చని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే త్వరగా ఆ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను కోరుతోంది..

ap high court serious on ap police
ap high court 

ఈ పరిషన్ ఎన్నికల నిర్వహణకు కోర్టు కేసులు ప్రధాన అడ్డంకిగా నిలిచాయి. అందుకే అవి కూడా త్వరగా క్లియర్ అయితే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు జరపాలని ఎస్‌ఈసీని ఆదేశించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా పడింది.

గత వారం కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాటిపై‌ విచారణకు ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తాజాగా తుది తీర్పు ప్రకటించింది. గతేడాది నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదన్న పిటిషనర్‌ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసిన హైకోర్టు గతంలో ఏకగ్రీవమైన చోట్ల డిక్లరేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని హైకోర్టు ఎస్‌ఈసీని ఆదేశించింది.