సొంత భజనతో జగన్ దగ్గర అడ్డంగా బుక్ అయిన వైసీపీ ఎమ్మెల్యే ?

cm jagan mohan reddy n

కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి అడ్డా .. అప్పుడు వైఎస్ .. ఇప్పుడు జగన్ వ్యక్తిగ‌త ఇమేజ్‌ తో కాంగ్రెస్‌, ఇప్పుడు వైసీపీకి తిరుగులేకుండా పోయింది. అలాంటి చోట వైసీపీకి వ‌చ్చిన స‌మ‌స్య ఏంటి , ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది అంటే .. కడప జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌మ్మలమ‌డుగు. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో సుధీర్‌రెడ్డి దాదాపు 53 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు.

ap cm jagan
ap cm jagan

అయితే.. ఇదంతా త‌న‌దే క్రెడిట్ అనుకుంటున్న ఆయ‌న‌.. కింది స్థాయి కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ గ్యాప్‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు ఇటీవ‌లే పార్టీలో చేరిన మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి. ఈయ‌న టీడీపీ నుంచి వైసీపీలో కి జంప్ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు. జమ్మలమడుగు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అయితే..దివంగ‌త‌ వైఎస్‌ హయాంలో కాంగ్రెస్‌ పాగా వేసింది.

అంతకుముందు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి చుట్టూ ఇక్కడి రాజకీయాలు తిరిగేవి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. డాక్టర్‌గా ఆయ‌న‌కు మంచి పేరున్నా.. రాజ‌కీయంగా ఎవ‌రిని ఎలా , డీల్ చేయాలో తెలియ‌డం లేదు. ఎన్నిక‌ల్లో గెలిచాక ఆయ‌న ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, కేవ‌లం తాను ఎంచుకున్న వారికి మాత్రమే కాంట్రాక్టులు.. ప‌నులు అప్పగిస్తున్నార‌ని కేడ‌ర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇంత మెజార్టీ రావ‌డానికి తానే కార‌ణం అనడంతో పాటు జ‌గ‌న్ కుటుంబం పేరు ఎందుకు ఇక్కడ ఎత్తుతారు , ఇక్కడ తానే ఎమ్మెల్యేను అని వైసీపీ వాళ్లపైనే విరుచుకు ప‌డుతున్నార‌ట.

మ‌రోవైపు రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వ‌చ్చినా, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఏమాత్రం ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదట. ఈ క్రమంలో ఆయ‌నే సొంత‌గా క్యాడ‌ర్‌ను త‌యారు చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారు, అసంతృప్తితో ఉన్నవారంతా.. కూడా రామ‌సుబ్బారెడ్డికి అనుకూలంగా మారిపోతున్నారు. ఇక సుధీర్‌రెడ్డి సీఎం జగన్ పేరెత్తితేనే మండిప‌డుతున్నార‌న్న విష‌యం రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం బాగా ప్రచారం చేస్తూ వాళ్లను త‌మ వైపున‌కు తిప్పుకుంటోంది. ఇది ఏ సంఘటలని దారి తీస్తుందో చూడాలి. అయితే గత ఎన్నికల్లో ఈయనకి భారీ మెజారిటీ రావడానికి కారణం మాత్రం జగన్ కి ఉన్న వ్యక్తిగత ఇమేజే అని అందరికి తెలిసిన విషయమే. దీనిపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో కూడా పార్టీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.