ఆ ఎమ్మెల్యే విషయంలో పవన్, చిరంజీవి మాట కూడా వినట్లేదా.?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన వైసీపీ కీలక నేత ఆయన. గతంలో మంత్రిగా వుండేవారు వైఎస్ జగన్ ప్రభుత్వంలో. కానీ, పదవి కోల్పోయారు.. మంత్రి వర్గ విస్తరణలో. అప్పటినుంచీ ఆయన సైలెంటయిపోయారు. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కూడా.

ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశాడాయన. పైగా ఓ బలమైన సామాజిక వర్గానికి ప్రతినిథిగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడాయన రాజకీయ జీవితం అగమ్య గోచరంగా తయారైంది. మంత్రి పదవి పోయాక, పెద్దగా రాజకీయాల్లో కనిపించడంలేదు. సోదరుడేమో సినిమాల్లో వున్నాడాయె.!

వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం దాదాపుగా లేదట. ‘పవన్ కళ్యాణ్‌ని తిట్టడంలో సమర్థవంతంగా పని చేయడంలేదు’ అనే నెపంతోనే ఆయన్ని మంత్రి పదవి నుంచి తీసేశారట. మరి, గట్టిగా తిట్టిన వాళ్ళలోనూ కొందరి పదవులు పీకేశారు కదా.? అంటే, అది వేరే చర్చ. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు కావడంతో, తన రాజకీయ భవితవ్యంపై ఇటీవల మెగాస్టార్‌ని కలిసి.. ‘అన్నయ్యా.. నా రాజకీయ జీవితం..’ అంటూ కన్నీరుమున్నీరయ్యాడట.

‘తమ్ముడ్ని ఒప్పించవా అన్నయ్యా..’ అని దేబిరిస్తే, ‘సర్లే మాట్లాడతాను..’ అని చిరంజీవి హామీ ఇచ్చారట. తమ్ముడ్ని పిలిచి అడిగితే, ‘అన్నయ్యా.. నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు..’ అనేశారట జనసేనాని. రాజకీయ వర్గాల్లో.. అందునా, వైసీపీ వర్గాల్లోనే ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. ఎవరా మంత్రి.? ఏమా కథ.?