టీడీపీ విషయంలో జగన్ తప్పు చేస్తున్నారా.. ఆ విమర్శలు అవసరమా?

తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఆ అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందేలా చూసింది. పేద ప్రజలకు, కార్మికులకు అన్న క్యాంటీన్ల వల్ల బెనిఫిట్ కలిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుందని ఈ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు మరింత బెనిఫిట్ కలుగుతుందని అందరూ భావించారు.

అయితే కారణాలు తెలియవు కానీ ఎన్నో పథకాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న జగన్ ఈ పథకంపై మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. రాజన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినా టీడీపీకే మైలేజ్ వస్తుందని భావించి జగన్ ఈ విధంగా చేసి ఉండవచ్చని చాలామంది అనుకున్నారు. అయితే టీడీపీ ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్లకు అడ్డుపడుతూ వైసీపీ విమర్శలు మూటగట్టుకుంటోంది.

మరోవైపు టీడీపీ నేతలు సైతం కొన్ని విషయాలకు సంబంధించి మారాల్సి ఉంది. హద్దులు దాటి విమర్శలు చేసుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ జగన్ పై హద్దులు దాటి అన్న క్యాంటీన్ల విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరు వల్ల విమర్శలు చేస్తుండగా జగన్ కు ఆ విమర్శలు అవసరమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైసీపీ ఈ విధంగా చేయడం వల్ల చంద్రబాబు, లోకేశ్ నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో పాటు ప్రజల్లో కూడా వైసీపీపై ఒకింత నెగిటివ్ ఒపీనియన్ కలుగుతోంది. అన్న క్యాంటీన్లను అడ్డుకోవడం ద్వారా టీడీపీకీ వైసీపీ భయపడుతోందని చాలామంది ప్రజల్లో అభిప్రాయం కలుగుతోంది. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టే విధంగా వైసీపీ వ్యవహరించడం ఆ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.