పథకాలు వద్దంటే ఆపేస్తాం.. వైసీపీ మంత్రి వ్యాఖ్యలు నిజం అవుతాయా?

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జగన్ సర్కార్ డబ్బును పప్పూ బెల్లాలలా పంచి పెడుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే నెగిటివ్ కామెంట్ల గురించి ధర్మాన స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పథకాలు వద్దంటే ఆపేస్తామని పథకాలు ఆపేసే విషయంలో అభ్యంతరాలు లేవని ధర్మాన అన్నారు.

 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ధర్మాన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అమలవుతున్న పథకాలే కారణమని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంను అమలు చేస్తున్నామని వైసీపీ మంత్రి వెల్లడించారు. నిత్యావసర వస్తువుల ధరలు దేశమంతటా ఒకేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

అయితే వైసీపీ అమలు చేస్తున్న పథకాలను ఆపేయాలని ప్రజలు ఎప్పటికీ కోరుకోరు. వైసీపీ పథకాల వల్ల వేల రూపాయలు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ప్రజలు పథకాలను వద్దనుకునే ఛాన్స్ లేదు. టీడీపీ కూడా పథకాల విషయంలో జగన్ ను ఫాలో కావాలని భావిస్తోందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.

 

ఉద్యోగాల నోటిఫికేషన్లను జగన్ సర్కార్ రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది చెబుతుండగా రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో అయినా వైసీపీ భారీ నోటిఫికేషన్లను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.