టిడిపి అభ్యర్ధి గెలుపుపై వైసిపి నేత బెట్టింగ్

మొన్నటి ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన బెట్టింగులు జరుగుతున్నాయి. మామూలుగా గెలిచే అభ్యర్ధి ఎవరనే విషయంలో పందేలు కాయటం చూస్తుంటాం. కానీ మొన్నటి పోలింగ్ తర్వాత ఓడిపోయే అభ్యర్ధి ఎవరనే విషయంలో కొన్ని చోట్ల పందేలు కాశారు. అలాగే, గెలిచే అభ్యర్ధికి ఎంత మెజారిటీ వస్తుందని కూడా పందేలు కాశారు. తాజాగా పలానా నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధే గెలుస్తుందంటూ వైసిపి నేత బెట్టింగ్ కాశారట.

కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ తంగిరాల సౌమ్య పోటీ చేశారు. వైసిపి తరపున డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు బరిలోకి దిగారు. సరే చాలా చోట్ల పోటీ హోరా హోరీగా సాగినట్లే నందిగామలో కూడా పోటీ ఉత్కంఠగా జరిగింది. దాంతో ఎవరికి వారుగా తమ పార్టీనే గెలుస్తుందంటే తమ పార్టీదే గెలుపంటూ చెప్పుకుంటున్నారు.

అయితే పోలింగ్ కేంద్రాల వారీగా నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఓ వైసిపి నేత మాత్రం గెలుపు టిడిపి అభ్యర్ధి సౌమ్యదే అంటూ బెట్టింగ్ కు దిగారట. సౌమ్య గెలుపు ఖాయమంటూ సదరు నేత రూ 20 లక్షలు పందెం కాయటమే నియోజకవర్గంలో విచిత్రంగా చెప్పుకుంటున్నారట.  వైసిపి నేతే టిడిపి అభ్యర్ధి గెలుపుపై బెట్టింగ్ కాశారంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే.