Actor Suman: సినీ నటుడు సుమన్ ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. అయితే ఇటీవల కాలంలో సుమన్ పూర్తిగా సినిమాలను తగ్గించారనీ చెప్పాలి. ఈయన ఇటీవల కాలంలో సినిమాలలో అతిథి పాత్రలలో నటిస్తున్నప్పటికీ ఈమధ్య వాటికి కూడా పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇకపోతే సుమన్ తరచూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నారు.
తాజాగా ఈయన అనంతపురంలో ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో జరిగిన జగన్నాథ రథయాత్ర సందర్భంగా సుమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సుమన్ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ నివాసానికి వెళ్లారు. ఇలా వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఇంటికి వెళ్లిన సుమన్ మీడియా సమావేశంలో భాగంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై చంద్రబాబుపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది.
అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. చంద్రబాబు తన తొలి రాజకీయ గురువని, దూరదృష్టి కలిగిన నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. రాష్ట్రానికి సమగ్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు వంటి నాయకత్వం అవసరమని సుమన్ పేర్కొన్నారు. అయితే చంద్రబాబు అద్భుతమైన పాలన అందిస్తున్నారు అంటూ వైసీపీ నేత ఇంట్లో సుమన్ మాట్లాడటంతో ఇది కాస్త విమర్శలకు కారణం అవుతుంది. ప్రస్తుతం అయితే తనకు రాజకీయాలలోకి రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తే తప్పనిసరిగా తిరిగి రాజకీయాలలోకి వస్తాను అంటూ ఈ సందర్భంగా సుమన్ తెలియచేశారు.
గతంలో రాజకీయాల్లో కొంత అనుభవం ఉన్న సుమన్, తన ప్రాధాన్యత సినిమాలు, సామాజిక కార్యక్రమాలపైనే ఉందని తెలిపారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన వెల్లడించారు