ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలలో మెజారిటీ నిర్ణయాలకు కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేస్తున్న జగన్ సర్కార్ అభివృద్ధి విషయంలో మాత్రం ఫెయిల్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ రంగుల విషయంలో ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ భవనాలకు రంగులు వేసిన విషయంలో వైసీపీ సర్కార్ కు గతంలో కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి. చివరకు వినాయకునికి కూడా వైసీపీ రంగులు ఉండటంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గణేష్ ఉత్సవాల విషయంలో జగన్ సర్కార్ అమలు చేస్తున్న నియమనిబంధనలపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా వ్యవహరించడం సరికాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వినాయకునికి వైసీపీ రంగులు అంటే ఇంతకంటే మరో దారుణం ఉందా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం దిశగా అడుగులు వేయడం మంచిది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీ రాజకీయ నేతలు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే స్వయంకృతాపరాధాల వల్ల ప్రజలకు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంది. వైసీపీ నేతలు ఇప్పటికైనా ఇలాంటి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఏపీ రాజకీయ నేతలు ఇప్పటికైనా ఈ విషయాలకు సంబంధించి మారతారో లేదో చూడాల్సి ఉంది. రాజకీయ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తే ప్రజలు బుద్ధి చెప్పటానికి ఎంతోకాలం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.