2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్నాయని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే టీడీపీ జనసేన పొత్తు గురించి అధికారిక ప్రకటన వెలువడితే జగన్ సైతం తన నిర్ణయాలను మార్చుకునే అవకాశం ఉంది. కేంద్రం జగన్ విషయంలో అనుకూలంగా ఉందనే సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అప్పులు అంతకంతకూ పెరుగుతున్నా వైసీపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరించడంతో కొత్త అప్పులు పుడుతున్నాయి.
జగన్ సర్కార్ కు కొత్తగా 1413 కోట్ల రూపాయల అప్పు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. తెలంగాణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ ఏపీ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఏపీకి అప్పులు ఇవ్వకుండా ఉండాలంటే కేంద్రం ఆ దిశగా అడుగులు వేయవచ్చు. అయితే మోదీ సర్కార్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదనే సంగతి తెలిసిందే.
బీజేపీతో సన్నిహితంగా ఉన్న జగన్ బీజేపీ వైసీపీ కలిసి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తే ఇరు పార్టీలకు భారీ స్థాయిలో లాభం చేకూరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పవచ్చు. కేంద్రం సహాయసహకారాలు అందిస్తే బెనిఫిట్ పొందే పార్టీలలో ఏపీ ముందువరసలో ఉంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
జగన్ ఈ దిశగా అడుగులు వేస్తే టీడీపీ జనసేన కూటమికి కూడా భారీ షాక్ ఉంటుందని చెప్పవచ్చు. మరి జగన్ మనస్సులో ఏముందో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల ఫలితాలను మించిన ఫలితాలను సొంతం చేసుకోవాలని జగన్ సర్కార్ భావిస్తుండగా జగన్ సర్కార్ కోరిక తీరుతుందో లేదో చూడాల్సి ఉంది.