ఏపీ రాజకీయాల్లో మంత్రి యనమల రామకృష్ణుడు సీనియర్ నేత. ఈ ఏడాది సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన సింగపూర్ లో పంటి వైద్యం చేయించుకున్నారు. పంటి చికిత్స కోసం 2 .88 లక్షల రూపాయలు ఖర్చు చేశారు యనమల. ఈ బిల్లును గవర్నమెంట్ ఖాతాలో వేశారు. దీంతో సర్వత్రా ఆయనపై విమర్శలు చెలరేగాయి. ఈ విమర్శల దాడితో దిగొచ్చారు మంత్రి యనమల. ఆయన ఏం చేసారో కింద ఉంది చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు ఈ ఏడాది ఏప్రిల్ లో సింగపూర్ పర్యటనకు వెళ్లారు. 12, ఏప్రిల్ 2018లో ఆయన సింగపూర్ లో ఉన్నారు. పెట్టుబడుల సమీకరణ కోసం ఆయన సింగపూర్ లో పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు పంటి నొప్పి రావడంతో రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ చేయించుకున్నారు.
రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ ఏమంత ఎమర్జన్సీ వ్యవహారం కాదు. ఇండియాకు వచ్చి చేయించుకోవచ్చు. అయినా సరే ఆయన సింగపూర్ లోనే చేయించుకోవడం చర్చనీయాంశమయింది.
ఆయనపై విమర్శల దాడి మొదలైంది. ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై దుయ్యబట్టాయి. రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ కోసం ఎక్కడెక్కడి నుండో ఇండియాకి వస్తుంటే మీరు సింగపూర్ లో చేయించుకుని ప్రజాధనం ఖర్చు పెట్టడం ఏమిటంటూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిసింది. కాగా ఏపీ మంత్రి ఈ వ్యవహారంలో దిగొచ్చిన్నట్టు తెలుస్తుంది. సొంత ట్రీట్మెంట్ కోసం ప్రజల డబ్బును ఖర్చు చేయడం సమంజసం కాదని ఆలోచన వచ్చినట్టుంది ఆయనకి. సింగపూర్ లో పంటి వైద్యం కోసం ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి ఆయన ఏపీ ప్రభుత్వానికి చెల్లించారు.
సింగపూర్ లో యనమల పంటి ఆపరేషన్ చేసిందెవరో కాదు, మనోడే… https://telugurajyam.com/who-benefited-from-yanamala-root-canal-treatment-son-of-tdp-mp-kanakamedala/