మస్ట్ రీడ్: యనమల నిస్సిగ్గు వ్యాఖ్యల వేళ.. సామాన్యుడి వివరణ ఇది!

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? విభజన హామీల్లో ఒకటైన పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇప్పుడు ఇలా ఉండటం ఎవరి పాపం? హోదా వద్దు ప్యాకేజీ ముద్దంటూ మూడు నాలుకలతో మాట్లాడింది ఎవరు? వీటన్నింటికీ కారణం ఒక్కరే… చంద్రబాబు! పార్టీలకతీతంగా ఏపీ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది! అయితే హోదా రాకపోవడానికి కారణం జగన్ అని మాట్లాడుతున్నారు యనమల!

కొంతమంది రాజకీయ నాయకులు మరీ నిస్సిగ్గుగా వ్యాఖ్యానిస్తుంటారని అంటుంటారు. జనం చీపో అని ఇప్పటికే పలుమార్లు చెప్పినా వారికి జ్ఞానం రాదని.. వారు పోవడమే కాకుండా పార్టీని కూడా ముంచేస్తుంటారని మిగిలినవారు వాపోతుంటరు. ఈ క్రమలో తాజాగా యనమల రామకృష్ణుడి వ్యవహారం అలానే ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలో తాజాగా మైకులముందుకు వచ్చిన టీడీపీ శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రత్యేక హోదాపై స్పందించారు. జగన్ అసమర్థతతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని వ్యాఖ్యానించారు. నాడు చంద్రబాబు హోదా కోసం పోరాడారని చెప్పుకొచ్చారు. దీంతో మీ నిస్సిగ్గు వ్యాఖ్యలను కాసేపు పక్కనపెట్టి… ఈ లిస్ట్ చదవండి అంటూ వివరాలు అందిస్తున్నారు నెటిజన్లు!

2014 ఏప్రిలో తిరుపతి వెంకన్న పాదాల సాక్షిగా ప్రసంగించిన చంద్రబాబు… “మనకు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామంటున్నారు. ఐదేళ్లు, పదేళ్లు కాదు, పదిహేనేళ్లు ఇవ్వండి అని మోడీగారిని కోరుతున్నా” అని చెప్పారు. దీంతో మోడీ – చంద్రబాబు కలిసి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తారని ప్రజలు నమ్మారు.. ఓట్లు గుద్దారు.. గద్దెనెక్కించారు.

ఇక ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. విజయవాడ నవనిర్మాణ దీక్ష సందర్భంగా 2015 జూన్ నెలలో “ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు” అని పలికారు. అక్కడితో ఆగని ఆయన… 2015 ఆగస్టులో మరింతగా నాలుక మడపెట్టారు. ఆ సమయంలో న్యూఢిల్లీలో ప్రధానితో భేటీ తర్వాత స్పందించిన చంద్రబాబు… “ప్రత్యేక హోదా ఏమీ సంజీవిని కాదు” అని వ్యాఖ్యానించారు.

అదే ఏడాది డిశెంబర్ లో “హోదాతోనే అన్నీ రావు. కోడలు మగ పిల్లాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?” అని హోదా కంటే ప్యాకేజీ బెటర్ అన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం… “హోదాతో ఏం వస్తుంది? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?” అని తనదైన శైలిలో స్పందించారు.

ఇక ఇదే ఫ్లో లో మాట మార్చిన చంద్రబాబు… 2016 మే లో “హోదాతోనే అంతా కాదు. అదేమీ సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధానికి విన్నవించా…” అని చెప్పుకొచ్చారు. అదే ఏడాది సెప్టెంబర్ లో “ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా… దాని వల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం” అని సవాల్ విసిరారు!

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, ప్రజాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులూ నిరసన కార్యక్రమాలకు దిగారు! ఈ సమయంలో తనలోని నియంతను మరోసారి బయటకు తీసిన చంద్రబాబు… “హోదా అంటే జైలుకే…!” అని బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విద్యార్థుల తల్లి దండ్రులను హెచ్చరించారు!

అనంతరం 2017 మార్చి లో “మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు.. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తున్నాం” అని ప్రకటించారు.

అనంతరం మోడీతో చెడింది. మరోపక్క రాష్ట్రంలో తన పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. మరోపక్క 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో బాబు మళ్లీ మాట మార్చారు. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నదే మన డిమాండ్.. ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు” అని శ్రేణులకు సూచించారు!

ఈ విషయం గ్రహించిన ఏపీ ప్రజలు… జన్మలో చంద్రబాబుని నమ్మకూడదని భావించారో ఏమో కానీ… 2019 సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారు. తన కుమారుడిని మంగళగిరిలో ఓడించారు. చంద్రబాబు అన్యాయాలకు అన్ కండిషనల్ గా మద్దతిచ్చినట్లు కనిపించిన పవన్ ను రెండుచోట్లా ఓడించారు!

ఈ విషయాలు మరిచారో.. లేక, ఏపీ ప్రజలకు అంత జ్ఞాపకశక్తి లేదనుకున్నారో తెలియదు కానీ… ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి జగన్ కారణం అంటూ నిస్సిగ్గు వ్యాఖ్యలు చేస్తున్నారు యనమల రామకృష్ణుడు!