అమరావతి నిర్మాణం అప్పు విషయంలో చంద్రబాబునాయుడు అండ్ కో కు ప్రపంచబ్యాంకు పెద్ద షాకే ఇచ్చింది. అమరావతి నిర్మాణానికి తాము అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని తాజాగా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ వైఖరి వల్లే తాము అప్పు ఇచ్చే విషయం నుండి వెనక్కు మళ్ళినట్లు చెప్పటం నిజంగా చంద్రబాబు అండ్ కో కు షాకనే చెప్పాలి.
అమరావతి నిర్మాణం విషయంలో తాము అప్పు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు నాలుగు రోజుల క్రితం ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. దాంతో ప్రపంచబ్యాంకు నిర్ణయానికి జగన్ ప్రభుత్వం చేతకానితనమే కారణమంటూ చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఎల్లో మీడియా ఒకటే విష ప్రచారం చేస్తోంది. జగన్ వైఖరికి వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు కూడా వండి వారుస్తున్నాయి.
అయితే వాళ్ళందరికీ షాకిస్తున్నట్లుగా ప్రపంచబ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది. అప్పు ఇవ్వకూడదన్న తాజా నిర్ణయానికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని చెప్పింది. తమ నిర్ణయానికి కేంద్రప్రభుత్వ వైఖరే కారణమంటూ ప్రకటించింది. దాంతో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా కు ఊహించని షాక్ కొట్టినట్లైంది.
నిజానికి ప్రపంచబ్యాంకు నిర్ణయానికి జగన్ ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని అందరికీ తెలుసు. అప్పు ఇచ్చే నిర్ణయంలో ప్రపంచబ్యాంకు నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు హయాంలోనే. అంటే మే నెలలోనే నిర్ణయం తీసుకుంటే ప్రకటించింది మాత్రం జూన్ 12వ తేదీ. అదే సమయంలో జగన్ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మే 30వ తేదీ. ఏదేమైనా ప్రపంచబ్యాంకు తాజా ప్రకటన చంద్రబాబు ఇబ్బంది పడేసేది.