స్వైన్ ఫ్లూతో మహిళ మృతి, హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ టెన్షన్

హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూతో మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన విజిత సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ప్రత్యేక వార్డులో వైద్యులు చికిత్సనందించారు. స్వైన్ ఫ్లూ తీవ్రం కావడంతో ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మద్యాహ్నం చనిపోయారు. దీంతో వైద్యులు అలర్టయ్యారు. మరికొంత మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

 5 గురు నల్సార్ లా యూనివర్సిటి విద్యార్ధులు స్వైన్ ఫ్లూ లక్షణాలతో హాస్పిటల్ లో చేరారు. వారికి వ్యాధి ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. మరో 9 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు.