రామ్ దేవ్ బాబా భారత ప్రధాని అవుతారా? :న్యూయార్క్ టైమ్స్ చదవండి

 

యోగా గురువు బాబా రామ్‌దేవ్ భారత ప్రధాని అవుతారా? ఈ ప్రశ్న భారతదేశంలో ఎంతమందికి తట్టిందో గాని, న్యూయార్క్ టైమ్స్ మా్త్రం బాబా రామ్ దేవ్ కు ఆ లక్షణాలున్నాయని పేర్కొంది.

 

యోగాతో పాటు వ్యాపారంలో కూడా బాబా సాధిస్తున్న విజయాలు ప్రపంచమంతా మారుమ్రోగి పోతున్నాయి. బిజినెస్ గ్రాజుయేట్స్ తో సంబంధం లేకుండా సొంతంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని బహుళ జాతి కంపెనీలు కూడా భయపడే లాగ నడుపుతున్న బాబా ఇపుడు అంతర్జాతీయ సెలెబ్రిటీ అయిపోయారు.

అందుకే అమెరికాలోని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక ఆయన మీద కన్నేసింది. బాబా లో ఉన్న రాజకీయ గుణాల మీద ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. వ్యాపారంలో విజయవంతమయి, కోట్లు గడించి, చివరకు ఆమెరికా అధ్యక్షుడయిన డొనాల్డ్ ట్రంప్‌తో బాబాను పోల్చింది. బాబా ట్రంపుల ఆలోచనల్లో చాలా చాలా పోలికలు చెబుతూ యోగా గురు రామ్ దేవ్ బాబా భారతదేశ డొనాల్డ్ ట్రంప్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.

 


బాబా రామ్‌దేవ్ భారత ప్రధాన మంత్రి పదవికి పోటీపడే అవకాశాలు ఉన్నాయని దేశంలో ఊహాగానాలు వినపడుతున్నాయని కూడా ఈ పత్రిక వ్యాఖ్యానించింది. ‘ది బిలియనీర్ యోగి బిహైండ్ మోడీస్ రైజ్’ (మోదీ ఎదుగుదల వెనుక ఉన్న కోట్లకు పడగలెత్తిన యోగి) అనే శీర్షికతో ఈ వ్యాసం రాస్తూ మోదీ ప్రధాని అంతెత్తుకు ఎదగడం వెనక బాబా ఉన్నాడన్న అర్థం స్ఫురింప చేసింది. ఈ వ్యాసం చదివితే, మోదీ యోగా క్యాంపెయిన్ బాబాను గ్లోబల బిజినెస్ లీడర్ చేయడమేనా అని అనిపిస్తుంది. మోదీ చాల ా పెద్ద ప్లాన్ తో ఉన్నారని కూడా అనిపిస్తుంది.

 

న్యూయార్క్ టైమ్స్ పత్రి క దృష్టిలో రామ్ దేవ్ బాబా, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్ పోలికలు.

1. ట్రంప్ మాదిరిగానే బాబా సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్.
2. రామ్ దేవ్ బాబా కూడా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాధిపతి.
3. దేశంలో రామ్ దేవ్ బాబా కూడా అత్యంత జనాదర ఉన్న సెలెబ్రిటీ.
4. రామ్ దేవ్ బాబా పేరు, ముఖం భారతదేశంో గుర్తించలేని వాళ్లెవరూ లేదరు.
5. రామ్ దేవ్ బాబా చిత్రాలు భారతదేశంలో మూలమూలలా కనిపిస్తాయి.
6. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాదిరిగా రామ్‌దేవ్ కూడా తనను చికాకు పెడితే చిర్రబుర్రు లాడతాడని పత్రిక పేర్కొంది. సంతోషం కనిపించేలా నమస్కారం చేయడం రామ్ దేవ్ అస్త్రమని పేర్కొంది. దేశాన్ని మార్చడానికి ఈ  ‘నమస్తే’ ని ఆయన వాడుకోవచ్చని చెప్పింది.

అన్నింటికంటే ముఖ్యంగా  ప్రధాన మంత్రి కన్నా ఈ యోాగా గురు శక్తివంతుడని,  ఆయనకు గొప్ప ఫాలోయింగ్ ఉందని, తాను పవిత్ర ఉద్దేశంతో పని చేస్తున్నానని దేశాన్ని ఒప్పించగల సత్తా ఉందని కూడా న్యూయార్స్ టైమ్స్ పత్రిక రాసింది.

 

ఏమో ఏపుట్టలో ఏ పాముందో…