2024లో టీడీపీ జనసేన ఓడిపోతే ఏం చేస్తావ్ పవన్.. విమర్శలు తప్పవా?

ప్రజాస్వామ్య దేశాలలో ప్రజల అభిప్రాయాలకు ఎక్కువగా విలువ ఉంటుంది. ప్రజలు ఎవరినైతే గెలిపించాలని భావిస్తారో ఎన్నికల్లో వాళ్లే గెలుస్తారు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ అధికారంలోకి రావడం వల్ల పవన్ కు ఏ స్థాయిలో మేలు జరిగిందో తెలీదు కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారు.

ఆ ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి కారణమైంది. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీనే అధికారంలోకి రావాలని ప్రజలు భావిస్తే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా ఫలితం ఉండదు. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలకు తెలుసు. టీడీపీ అభిమానులు మినహా మిగతా వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందడం జరగదు. టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదు.

అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం వల్ల మూడు పంటలు పండే భూముల విలువ ఊహించని స్థాయిలో తగ్గిపోయిందని కూడా కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నా రాయలసీమలో ఈ పార్టీల పొత్తు వల్ల అణువంతైనా ప్రయోజనం ఉండదు. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో కూడా జగన్ పై మంచి అభిప్రాయం ఏర్పడిందనే సంగతి తెలిసిందే.

జగన్ 2024 ఎన్నికల్లో కూడా గెలిస్తే టీడీపీ జనసేన పార్టీలకు భారీ నష్టం చేకూరే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన ఓడిపోతే పవన్ దగ్గర చెప్పడానికి సమాధానం కూడా ఉండదని చెప్పవచ్చు. పవన్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాలలో పవన్ కెరీర్ ను కొనసాగిస్తే ఆయనకు మంచిదని కొంతమంది సూచిస్తున్నారు. పొత్తుకు మద్దతు ఇచ్చి టీడీపీ జనసేన కూటమి ఓడిపోతే పవన్ పై విమర్శలు తప్పవు.