యవనేతలను చంద్రబాబు ఎదగనిస్తారా ?

ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో మాట్లాడిన సీనియర్లందరూ యువతకు పెద్ద పీట వేయాలంటూ సూచనలు చేశారు. నిజానికి సీనియర్లు చేసిన సూచనలు చాలా విలువైనవే. ఏ పార్టీ బాగా పనిచేయాలన్నా సీనియర్లతో పాటు యువ నేతల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. అందుకనే సీనియర్లు తాజాగా అటువంటి సూచనలు చేశారు.

అయితే ఇక్కడే ఓ సమస్య ఉంది. అదేమిటంటే పార్టీలో ఇపుడున్న యువనేతల్లో చాలామంది నారా లోకేష్ కన్నా గట్టి నేతలే అనటంలో సందేహం లేదు. లోకేష్ తో పాటు చాలామంది యువనేతలు సీనియర్ల వారుసులుగానే రంగ ప్రవేశం చేశారు. అయితే వీరిలో చాలామంది తమ సామర్ధ్యాన్ని నిరూపించుకున్నారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్, పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్, జేసి వపన్ లాంటి చాలామంది యువనేతలు మొన్నటి ఎన్నికల్లోనే పోటికి దిగాలనుకున్నారు.

అయితే వివిధ కారణాల వల్ల చంద్రబాబు యువనేతల్లో చాలామందికి పోటి చేసే అవకాశం ఇవ్వలేదు. పరిటాల శ్రీరామ్, జేసి పవన్ లాంటి ముగ్గురు, నలుగురికి మాత్రం తప్పనిపరిస్ధితుల్లో పోటికి అవకాశం ఇచ్చారు. ఇంతకీ యువనేతలకు చంద్రబాబు ఎందుకు పోటి అవకాశం ఇవ్వలేదు ? ఎందుకంటే మళ్ళీ లోకేషే అడ్డని చెప్పక్క తప్పదు. పార్టీలో కేవలం చంద్రబాబు కొడుకు అన్న ఏకైక అర్హతతోనే లోకేష్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు లేకపోతే లోకేష్ ను పట్టించుకునే వాళ్ళే ఉండరన్న విషయం అందరికీ తెలిసిందే.

చాలామంది యువనేతలతో పోల్చుకుంటే లోకేష్ ఎందుకూ పనికిరారు. ఒకవేళ మిగిలిన యువనేతలు గనుక ప్రజాప్రతినిధులుగా తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే  లోకేష్ పని గోవిందానే. అందుకనే చంద్రబాబు మిగిలిన యువ నేతలను ప్రోత్సహించేది అనుమానమనే అంటున్నారు చాలామంది. ఇపుడు తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయి కాబట్టి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.