ఈ మంత్రి గెలుపు కష్టమేనా ?

చంద్రబాబునాయుడు క్యిబినెట్ లో మంత్రులందరూ రెండోసారి పోటీ చేశారు. అయితే వీరిలో ఎంతమంది గెలుస్తారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. సరే మిగిలిన మంత్రుల సంగతి పక్కన పెడితే ఒక మంత్రి గెలుపోటముల విషయంలో మాత్రం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనే అమరనాధరెడ్డి.

ఒక్క అమర్ విషయంలో మాత్రమే ఎందుకు చర్చలు జరుగుతున్నాయంటే ఆయన స్వయంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు చెందిన మంత్రి కావటమే కారణం. పోయిన ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుండి వైసిపి తరపున గెలిచి తర్వాత తెలుగుదేశంపార్టీలోకి ఫిరాయించారు కాబట్టి చర్చల్లో హైలైట్ గా నిలుస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో అమర్ కు పోటీగా వైసిపి నుండి వెంకటేష్ గౌడ్ పోటీ చేశారు. జనసేన శ్రీకాంత్ నాయడు ఉన్నప్పటికీ పోటీ మాత్రం టిడిపి, వైసిపిల మధ్యే. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, వైసిపి నుండి తనకు పోటీనే లేదని ముందుగా అనుకున్న మంత్రి చివరకు ఎదురుదీల్సి వచ్చిందట. ఆ పరిస్ధితి ఎందుకు ఎదురైందంటే మంత్రి నమ్ముకున్న వాళ్ళే వ్యతిరేకం చేశారని సమాచారం.

తనకసలు పోటీనే కాదని అనుకున్న వెంకటేష్ అమర్ ను మూడు చెవురుల నీళ్ళు తాగించారట. ప్రచారంలో, డబ్బు ఖర్చు చేయటంలోనే కాదు పోల్ మ్యానేజ్ చేసుకోవటంలో కూడా మంత్రికన్నా వైసిపి అభ్యర్ధే బాగా చేసుకున్నాడని సమాచారం. దానికితోడు వైసిపిలో నుండి టిడిపిలోకి ఫిరాయించినందుకు జనాల్లో బాగా మంటగా ఉందట. అలాగే, పక్క నియోజకవర్గంలోనే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వెంకటేష్ కు పూర్తి అండదండలు అందించారట. దాంతో పలమనేరులో  మంత్రి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు.