వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై జగన్ నోరు విప్పేందుకు ముహూర్తం ఖరారు !

Will Jagan reveal the party stand on the Vizag steel plant ?

వైజాగ్: ఆంధ్రులు ఉక్కు సంకల్పంతో ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోతున్నాం అని ప్రకటించటంతో రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్ర నిర్ణయం అమలుకాకూడదని వ్యతిరేక ఉద్యమం మొదలైంది. అయితే అధికార వైసిపీ పార్టీ పై, ఈ విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పై వైసీపీ ప్రభుత్వం మాట్లాడటానికి మూడు రోజులు పట్టింది. ఈ విషయం తెలిసిన మరుసటి రోజు వైసిపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడవద్దు అన్నారు అంటూ, వాయిస్ లీక్ అవ్వటంతో, అనుమనాలు రేకెత్తాయి.

Will Jagan reveal the party stand on the Vizag steel plant ?
Will Jagan reveal the party stand on the Vizag steel plant ?

జగన్ మోహన్ రెడ్డి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ప్రధానికి ఒక లేఖ రాసి ఊరుకోవటంతో మరింతగా రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలలో నమ్మకం పోయింది. మరో పక్క పోస్కో కంపెనీతో విజయసాయి రెడ్డి డీల్ కుదిర్చి, జగన్ వద్దకు తెచ్చారని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను, పోస్కో కంపెనీకి కట్టబెట్టటానికి, డీల్ సెట్ అయ్యిందని, దీని వెనుక పెద్ద ఎత్తున ఆర్ధిక లావాదేవీలు ముడిపడి ఉన్నాయని టిడిపి ఆరోపిస్తుంది. ఇప్పటికే గత 20 రోజుల నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రైవేటీకరణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. వారికి సంగీభావం తెలుపుతూ వివిధ పార్టీ నాయకులు, సామాన్య ప్రజలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ఈ నేపధ్యంలోనే, జగన్ మోహన్ రెడ్డి, శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనటానికి ఈ నెల 17న వైజాగ్ వెళ్తున్నారు. ఆ రోజున దీక్షా స్థలం వద్దకు వచ్చి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతారా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒక వేళ వస్తే కనుక, తన పై వస్తున్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేయవచ్చు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం జరుగుతున్న ప్రాంతానికి వచ్చి, మద్దతు ఇవ్వకపొతే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఈ విషయంలో జగన్ ఏం చేస్తారో అని అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులలోనూ , మిగిలిన రాజకీయ పార్టీలతో పాటు వైసీపీ పార్టీ నాయకులలోను సందిగ్దత నెలకొంది.