ఆంధ్రప్రదేశ్: వైసీపీ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే విషయంలో అధిష్టానం విచిత్ర ధోరణిలో వ్యవహరిస్తుందని స్థానిక నేతలు కొంతమంది గుర్రుగా ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడినా సరే వారికి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కార్యకర్తలకు నేతల వద్ద ప్రాధాన్యత అనేది దక్కడం లేదనే చెప్పాలి. పార్టీ కోసం పని చేయకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇప్పుడు వైసీపీలో ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుంది అని ఆవేదన చాలా మంది కార్యకర్తలలో వ్యక్తమవుతుంది. వైసీపీలో ముందునుంచి పనిచేసిన కార్యకర్తలకు వైసీపీ నేతల వద్ద విలువ లేకుండా పోయింది. కనీసం మంత్రులుగా పని చేస్తున్న వారు కూడా ఇప్పుడు వైసీపీ కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పాలి.
కొంతమంది టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన తర్వాత వారి అనుచరులను వైసీపీ కార్యకర్తలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా పదిహేనేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నేతలు కూడా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి అనుచరుల ద్వారా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలుగా కలరింగ్ ఇచ్చే వారి ద్వారా అసలు వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. పార్టీలోకి ఎవరు పడితే వాళ్ళు వస్తే చేర్చుకో వద్దు అని కొంత మంది కార్యకర్తలు సీఎం జగన్ ను వేడుకుంటున్నారు. పార్టీని కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నేతలు నాశనం చేస్తున్నారని ఆవేదన కూడా ఇప్పుడు కొంత మంది కార్యకర్తలు నుంచి వ్యక్తమవుతోంది.