సుప్రీం కోర్టులో పిటిషన్.. ఏపీ సీఎం జగన్ అనుకున్నది సాధిస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ తెలంగాణకు షాకిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను వేగంగా పంచాలని కోరుతూ జగన్ సర్కార్ రిట్ పిటిషన్ వేయడం హాట్ టాపిక్ అవుతోంది. విభజన తర్వాత తనకు దక్కాల్సిన ప్రయోజనాలను కల్పించేలా చేయాలని కోరుతూ జగన్ సర్కార్ పిటిషన్ దాఖలు చేయడంపై తెలంగాణ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయి ఎనిమిది సంవత్సరాలు దాటినా ఆస్తుల విభజన ప్రారంభం కాకపోవడంతో ఏపీ తీవ్ర స్థాయిలో నష్టపోతుండటం గమనార్హం. ఈ విధంగా విభజన చేయకపోవడం తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్ కలుగుతుండగా ఏపీ మాత్రం తీవ్రస్థాయిలో నష్టపోతుండటం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ సర్కార్ పిటిషన్ గురించి సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

సమస్య జఠిలం కాకుండా ఆస్తుల పంపకం జరిగే విధంగా సుప్రీం కోర్టు అడుగులు వేస్తే మంచిదని చెప్పవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తులు, అప్పులను పంచుకోవడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. విభజన వల్ల తీవ్రస్థాయిలో నష్టపోయిన ఏపీకి ఇబ్బందులు కలగకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సర్కార్ పై కూడా ఉందని చెప్పవచ్చు.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన హామీలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. జగన్ అనుకున్నవి సాధిస్తే మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.