AP Govt Employees : ఉద్యోగులకు జీతాలు పడతాయా.? పడితే ఏమవుతుంది.?

AP Govt Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రేపు వెరీ వెరీ స్పెషల్ రోజు. ఎందుకంటే, కొత్త పీఆర్సీతో వేతనాలు అందుకోబోతున్నారు. అయితే, జీతాల ప్రాసెస్ విషయమై తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వం హెచ్చరించడంతో తొలుత ‘అతి’ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, చేసేది లేక.. జీతాల ప్రాసెస్ పని మొదలెట్టారు.

ఇంకోపక్క, ఉద్యోగ సంఘాలు మాత్రం తగ్గేదే లే.. అంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. రిలే నిరాహార దీక్షలు, రకరకాల రూపాల్లో నిరసనలు.. వెరసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సందడి కనిపిస్తోంది. మరి, జీతాలు పడ్డాక పరిస్థితి ఎలా వుంటుంది.?

‘ఎవరి జీతాలూ తగ్గే ప్రసక్తే లేదు..’ అని ప్రభుత్వం చెబుతున్న దరిమిలా, ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడ్డాక.. సీన్ ఖచ్చితంగా మారిపోవచ్చు. ఒకవేళ నిజంగానే ఉద్యోగుల వేతనాలు తగ్గితే మాత్రం, ప్రభుత్వానికి అది ఊహించని ఎదురు దెబ్బే అవుతుంది.

తగ్గిన జీతాలకు సంబంధించిన వివరాల్ని ఉద్యోగులు గనుక అధికారికంగా బయటపెడితే.. ప్రభుత్వానికి మారు మాట్లాడే ఛాయిస్ వుండదు. అది తెలిసీ, ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్ని ప్రాసెస్ చేయించిందంటే, ఎవరికీ జీతాలు తగ్గే అవకాశమే లేదని అనుకోవాలి.

ఏమో, రేపు ఏం జరుగుతుందో.. ఎవరి వాదనలో నిజమెంతో తెలియాలంటే రేపటిదాకా ఎదురుచూడాలి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఉద్యోగులు తలపెట్టిన ర్యాలీలు వంటివాటి విషయంలో కూడా రేపే క్లారిటీ రావొచ్చు. ఉద్యోగులది తప్పని తేలితే.. సమీప భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగుల్ని విశ్వసించే అవకాశమే వుండదు.