భర్త ఆచూకీ చెప్పాలంటూ అత్తారింటి ముందు ఆందోళనకు దిగిన భార్య (వీడియో)

తన భర్తను తనకు అప్పగించాలంటూ ఓ ఇల్లాలు అత్తా మామ ఇంటి ముందు కూర్చుని ఆందోళనకు దిగింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన అనూషకు రామచంద్రారావు తో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. గత కొంత కాలంగా అదనపు కట్నం తేవాలంటూ అత్తామామ అనూషను వేధించారు. అనూష కట్నం తేకపోవడంతో ఆమె పై వేధింపులు అధికమయ్యాయి.

రెండు నెలలుగా రామ చంద్రారావు ఇంటికి రాకుండా అత్తామామ అడ్డుపడుతున్నారని అనూష ఆరోపిస్తుంది. దీని పై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా అనూషకు ఎటువంటి న్యాయం జరుగలేదు. తన భర్తకు రెండో పెళ్లి చేస్తామని వేధిస్తున్నారని నిరసిస్తూ అత్తారింటి ఎదుట అనూష ఆందోళనకు దిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారిస్తున్నారు.