ఘనంగా నాగశౌర్య పెళ్లి వేడుకలు.. ఫోటోలు వైరల్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ ను ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నా హీరోల్లో నాగశౌర్య కూడా ఒకరు. చలో సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోని ఎంతో ప్రేక్షకాదరణ పొందాడు తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి నాగశౌర్య అకౌంట్ లో పడలేదు.ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో సక్సెస్ అందుకొని మరిన్ని కొత్త అవకాశాలను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు.

యంగ్ హీరో నాగశౌర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసింది. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ హీరో నాగశౌర్య మరికొన్ని గంటల్లో పెళ్లి పీట లెక్కనున్నారు. ఇప్పటికే నాగశౌర్య ఇంట పెళ్లి సందడి మొదలైంది. చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా సినీ, రాజకీయ ప్రముఖులు నాగశౌర్య వివాహానికి హాజరు కానున్నారు. నాగశౌర్య పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన పనులు మొదలుకావడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా నాగశౌర్య అనూష శెట్టిల జోడి అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.

నాగశౌర్య వివాహం చేసుకొని అమ్మాయి పేరు అనూష శెట్టి.ఈ కన్నడ అమ్మాయి ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా ఎంతో గుర్తింపు పొందింది. ఈ మధ్యకాలంలో ఉత్తమ ప్రతిభా అవార్డు అందుకుందట. అమ్మాయి ఫ్యామిలీ బిజినెస్ రంగంలో ఎన్నో ఏళ్ల కిందటే బెంగళూరులో స్థిరపడ్డారని తెలుస్తోంది. నాగశౌర్య అనూష వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమా లేక ప్రేమా వివాహమా అన్న సందేహం చాలామందిలో కలుగుతున్నప్పటికీ దీనిపై ఎటువంటి సమాచారం లేదు. ఏది ఏమైనా అప్పటికి నాగశౌర్య అనూష జోడి అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేస్తూనే నూతన దంపతులిద్దరికీ మ్యారేజ్ విషెస్ తెలియజేస్తున్నారు.