ఒకప్పుడు ఆయన కేవలం పరకాల ప్రభాకర్ మాత్రమే. కానీ, ఇప్పుడలా కాదు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త. భార్య నిర్వహిస్తున్న బాధ్యతాయుతమైన పదవికి అయినా గౌరవం ఇచ్చి, ఒకింత హుందాతనం ప్రదర్శించాలి. దురదృష్టం, ఆయన అలాంటి హుందాతనాన్ని పట్టించుకోడు.!
ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ సమయంలో పరకాల ప్రభాకర్ పేరు మార్మోగింది. అది కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీ మీద ‘విష వృక్షం’ అనే విమర్శలు చేయడంతో. చిరంజీవికి వెన్నుపోటు పొడిచినవారిలో పరకాల ప్రభాకర్ పేరు ముందుంటుంది. రాజకీయం అంటే ఇదీ.. అని చిరంజీవి తెలుసుకోవడానికి అసలు సిసలు కారకుడు పరకాల ప్రభాకర్.
ఆ పరకాల ప్రభాకర్ ఈసారి తన టార్గెట్‌ని జనసేన మీదకు షిఫ్ట్ చేసినట్లున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఏవో కామెంట్లు చేశారట ఆయన్ని ఉద్దేశించి. ఈ రోజుల్లో ఇదంతా కామన్. కానీ, అత్యంత జుగుప్సాకరంగా ఆ కామెంట్లపై పరకాల ప్రభాకర్ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తానొక బాధ్యతాయుతమైన పదవిలో వున్న మహిళకు భర్తననే విషయాన్ని మర్చిపోతున్నాడాయన.
ఇకపై రోజువారీ కొంత సమయం కేటాయించి బూతులు సోషల్ మీడియా వేదికగా వల్లెవేస్తానని పరకాల ప్రభాకర్ చెబుతుండడం శోచనీయం. చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇద్దరూ ఓడిపోవడాన్ని (చిరంజీవి రెండు చోట్ల పోటీ చేసి ఓ చోట ఓడితే, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు) పరకాల ప్రభాకర్ ప్రస్తావిస్తూ ట్వీటేశారు.
కుక్కలన్నారు.. ఇంకోటన్నారు.. పరకాల ప్రభాకర్ పాండిత్యానికి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అసలెందుకు పరకాల మళ్ళీ వచ్చినట్లు.? ఎవరు రప్పించినట్లు.?