రాను రాను చంద్రబాబునాయుడును భరించటం కష్టమైపోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుండి ఛాదస్తం మరీ ఎక్కువైపోయినట్లుంది. అవసరమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిపై అక్కసును ఏదో విధంగా తీర్చుకుంటున్నారు. జగన్ ఏమీ చంద్రబాబుపై ఎక్కడా మాట్లాడలేదు. మరి చంద్రబాబు మాత్రం ప్రతీరోజు జగన్ ను ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారో అర్ధం కావటం లేదు.
జగన్ థియేటర్ కు వెళ్ళి సినిమా చూశాడట. జగన్ సినిమాకు వెళ్ళటాన్ని కూడా చంద్రబాబు తట్టుకోలేకున్నారు. తుపాను సమయంలో జగన్ సినిమాకు వెళ్ళటమేమిటి ? అంటూ మండిపోయారు. తుపాను సమయంలో జగన్ విదేశాలకు వెళ్ళటం ఏంటి ? అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని అనుకుంటున్నారేమో ? అంటూ లాజిక్ లేకుండా మాట్లాడటమే విడ్డూరంగా ఉంది.
సినిమాకే వెళతాడో లేకపోతే విదేశాలకే వెళతాడో అది జగన్ ఇష్టం. జగన్ ఎక్కడికి వెళితే చంద్రబాబుకు ఎందుకు ? తుపాను సమయంలో చేయటానికి చంద్రబాబుకే ఏమీ పనిలేనపుడు ప్రధాన ప్రతిపక్షనేతకు ఏం పనుంటుంది ? మొన్నటి వరకూ సమీక్షలు చేయటానికి కూడా అడ్డుపడుతోందని ఈసిపై గింజుకున్నాడు కదా చంద్రబాబు.
చంద్రబాబు కూడా కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళి వచ్చారు కదా ? జగన్ ఏమన్నా మాట్లాడారా ? మరి ప్రతీ విషయంలోనే జగన్ ను ఎందుకు చంద్రబాబు కెలుకుతున్నారో అర్ధం కావటం లేదు. ఇదంతా వయసు పెరిగిపోవటంతో వచ్చిన ఛాదస్తంగా కనిపిస్తోంది. చంద్రబాబు ఛాదస్తాన్ని జనాలే భరించలేకుండా ఉన్నారు పాపం అధికారులు, టిడిపి నేతలు ఎలా భరిస్తున్నారో ?